తుగ్గలి ఏప్రిల్ 30 (way2newstv.com)
డివిజనల్ రైల్వే అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియజేశారు.77409 గుంతకల్-డొన్ ప్యాసింజర్ రైలు 3-5-2019 నుండి 9-5-2019 వరకు,77413 కర్నూలు-గుంతకల్ ప్యాసింజర్ రైలు 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు,77414 గుంతకల్-కర్నూల్ ప్యాసింజర్ రైలు 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు.
తాత్కాలికంగా పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
56501 విజయవాడ-హుబ్లీ ప్యాసింజర్ రైలు 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు,56502 హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలు 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియజేశారు.అదేవిధంగా 57426,57425, 77415 నంబర్ గల రైళ్లు 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు డోన్ నుండి ప్రారంభమవుతాయని తెలియజేశారు.అదేవిధంగా పలు ప్యాసింజర్ రైళ్లను వయ గుత్తి ద్వారా దారి మళ్లించామని రైల్వే అధికారులు తెలియజేసారు.10వ తేదీ నుండి రైలు యధావిధిగా ప్రారంభమవుతాయని తెలియజేశారు.ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తెలియజేశారు.