కాకినాడ, ఏప్రిల్ 26, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కేతారాజుపల్లి గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణలు తప్పడం లేదు. దీంతో న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. వివరాలు ప్రకారం బాధిత మహిళ కొండేపూడి చిలకమ్మ పోలీసులను, తహసీల్దార్ను ఆశ్రయించి తమగోడును వెళ్లబుచుకున్నారు. తన భర్త కొండేపూడి సత్యనారాయణ ఈ నెల 6వ తేదీన అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తమ ఎస్సి సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కానీ, ఇతరులు గాని ఎవరూ రాలేదని అన్నారు.
కేతరాజుపల్లి లో కుల బహిష్కరణ
దీంతో తన భర్త మృతదేహాని అనాధ సవంలా తీసుకెళ్ళాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. పోనీ దిన కార్యక్రమానికి అయినా వస్తారని అనుకుంటే ఎవరూ రాలేదు. ఎందుకు రాలేదా అని ఆరా తీయగా ఎవరైనా వెళితే రూ.500 జరిమానా, వెళ్ళిన వారిని కుల బహిష్కరణ చేస్తామని కుల పెద్దలు బెదిరించారని తెలిసిందన్నారు. తమ కుల సంఘానికి గాని తమ కుటుంబానికి గాని ఎటువంటి వివాదాలు లేవని అయినప్పటికీ గ్రామంలో అనాగరిక మైన కట్టుబాట్లతో తమ కుటుంబాన్ని పెద్దలు వెలివేసారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పక్క భర్త చనిపోయి కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ మరో వైపు కులపెద్దలు వెలివేసారన్న బాధతో తీవ్ర వేదనను అనుభవిస్తున్నమని తెలిపారు. అధికారులు దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.