శ్రీశైలం, ఏప్రిల్ 26, (way2newstv.com)
శ్రీశైలం పరివార దేవాలయమైన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి శుక్రవారం ఉదయం అభిషేకం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజున శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా సర్కారీ సేవగా నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ అంకాలమ్మ అమ్మవారి అభిషేకం విశేష పుష్పాలంకరణ విశేష పూజలు కుంకుమార్చనలు నిర్వహిస్తారు. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం ప్రధాన ఆలయానికి ఎదురుగా గల రహదారికి చివరలో కుడివైపున ఉత్తర ముఖంగా ఉంది.
అంకాలమ్మ అమ్మవారికి అభిషేకం
ప్రకృతి శక్తుల యొక్క కలలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆది పరాశక్తి స్వరూపమే నని మన ఆర్ష వాఙ్మయం చెబుతోంది. చతుర్భుజరా లైనా ఈ దేవి నాలుగు చేతులలో కుడి వైపున క్రింద నుండి వరుసగా కత్తి, సర్పం లో చుట్టబడిన ఢమరుకం ఉండగా ఎడమ వైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలు కంఠాభరణాలను కలిగి ఉంటుంది. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను చేశారు. ఆ తరువాత పంచామృతాభిషేకం, హరి పుష్ఫోదకం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాద వితరణ జరిగింది.