విజయవాడ, ఏప్రిల్ 27 (way2newstv.com)
ప్రతిపక్షం మొండితనం, కేంద్రం పంతం,మధ్యలో ఇసి జోక్యం అన్నింటినీ మించి సిఎం ఓవరాక్షన్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతను బలితీసుకుంటున్నాయి..వీరి నిర్వాకంతో కృష్ణా డెల్టా ఎడారిగా మారే పరిస్థితి కనిపిస్తోంది...ఇక రాయలసీమ మళ్లీ రాళ్లసీమఅయ్యే పరిస్థితి....ఇక గతే ఏడాది మంచి దిగుబడి వచ్చినా ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాత జాగారం చేస్తున్నాడు..అయినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మొండిపట్టు వీడడం లేదు...రాజ్యాంగాన్ని ధిక్కరించి రైతన్నను అగాధంలోకి నెట్టడానికి సిద్దమైంది.ప్రభుత్వాల నిర్లక్ష్యం ఓ వైపు పిట్టల్లా రాలుతున్నా విద్యార్ధులు.అంతేనా ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం పొంచి ఉంది.అదీ కృష్ణా డెల్టా ఎడారికానుంది.రాయలసీమ రాళ్లసీమను తలిపించనుంది....కారణం పూర్తిగా పరిపాలన యంత్రాంగం వైపల్యమే..వేసవి.అందరికీ ఇది శెలవుల కాలం కానీ రైతుకు మాత్రం పనంతా ఇపుడే పొలాన్ని బాగుచేసుకోవడం.పనిముట్లకు పదును పెట్టుకోవడం విత్తనాలు సిద్ధం చేసుకోవడం.పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కొత్త విత్తనాలు, ఎరువులు, కూలీలు అన్నీ సమకూర్చుకోవడం..ఇదీ వేసింగి వ్యవసాయం...ఇక మనం అసలు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విధులు రాజ్యాగంలోని ఆరోఅధ్యాయంలో స్పష్టంగా పేర్కొనిఉంది..
మార్కెట్ యార్డులలో నిలిచిపోయిన ధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో వ్యవసాయం, నీటిపారుదల రెండింటికీ సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే...రైతులకు వ్యవసాయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చెయ్యడం, రుణాల అందేలా చూడడం అన్నీ ప్రభుత్వ విధులే..అందునా వేసవి వస్తుందంటే...కాలువలు బాగు చేయించడం..సకాలంలో నీరందేలా చూడడం ఇవన్నీ ప్రభుత్వబాధ్యతలు..అందునా ప్రభుత్వాలు వేసవిలో చేపట్లాల్సిన చర్యలు..కానీ దురదృష్ఠవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి లేదు.కృష్ణా డెల్టా అంటేనే ఖరీఫ్‌లో రైతుల ఆందోళనలు గుర్తొసాయి..కానీ గత నాలుగేళ్లగా కృష్ణాడెల్టాలో ఈ పరిస్థితి లేదు.పట్టిసీమ ద్వారా పోలవరం కాలువనుంచి కృష్ణాలోకి నాటురావడంతో డెల్టా స్థీరీకరణ జరిగింది.సకాలంలో నారుమళ్లు పడ్డాయి..అంతకు ముందు ఎకరాకు 35 బస్తాలు వచ్చే వరి ఇటీవల కాలంలో 45 బస్తాలకు చేరుకుంది...రెండు పంటలతో ఆటు వేసవిలో అపరాలు అంటే మినుములు, పెసలు సాగుచేశారు..ఈసారి రేటు కూడా అపరాలకు మంచి రేటుంది. అంటే క్వింటాలు మినుములు 5,500 రూపాయలు పలుకుతున్నాయి..కౌలురైతు కళకళలాడాడు..ఇపుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.కాలవల ఆధునీకరణకు సంబంధించి ఏలాంటి సమావేశాలు నిర్వహించలేదు.ఎనిమిది వందల క్యూసెక్కుల నీళ్లును తీసుకువచ్చే ఏలురు కాలువ పనీ ఎక్కడికక్కడ ఆగిపోయింది..పోలవరం రివ్యూకు ఇసి బ్రేక్ వేసింది...రాష్ట్ర వ్యాప్తంగా కాలువల మరమ్మత్తులు, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంకోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశాలు జరగడం లేదు...అన్నింటినీ మించి గత ఏడాది పంటలు సకాలంలో పండినా కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం ఆగిపోయింది..మంచి రేటు ఉన్నా రైతు అపరాలు అమ్ముకునే పరిస్థితి లేదు...దీనికి సంబంధించి మార్కెటింగ్ శాఖలోనూ పట్టించుకునే నాధుడు లేడు.అసలు ఈ రివ్యూలకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు నానా రచ్చ చేసి అడ్డుకుంటే మరోవైపు ప్రతిపక్ష రైతు సంఘం నేతలే ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..కొనుగోలు కేంద్రాల దగ్గర ఎమెర్జెన్సీ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చెయ్యాలని వైసిపి రైతుసంఘం నేత నాగిరెడ్డి డిమాండ్ చేశారు..ఇక పట్టిసీమ నీళ్లు రాయలసీమ వరకు వెడతాయి...ఎందుకంటే రాయలసీమంతా ఖరీఫ్ వ్యవసాయం.పోతిరెడ్డునుంచి ఆగస్టువరకూ నీళ్లురావు.సీజన్ ప్రారంభంకల్లా వచ్చేది పట్టిసీమ నీళ్లే...దీంతో రాయలసీమ రైతు పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైంది....ఇపుడు పట్టిసీమ నీళ్లు విడుదల కాక ఎక్కడికక్కడ తాగునీటి ఎద్దడి నెలకొంది..ఇక కాలువ మరమ్మత్తులకోసం చీఫ్ ఇంజనీర్ల దగ్గరనుంచి చివరకు పంచాయితీ రాజ్‌లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ఎవరూకనీసం పలకడం లేదు...ఫోన్లు ఎత్తే పరిస్థితీ లేదు...మంత్రులు చెప్పినా వినే పరిస్థితి లేదు..ఇక నీటి విడుదల ఆలస్యమైతే, వ్యవసాయం ఆలస్యమైతే వచ్చేది తుఫానుల సీజన్.అంటే కష్టపడి పండిచిన పంట గాలికి, నీటికి కొట్టుకుని వెడుతుంది...అంటే సిఎస్ నిర్లక్ష్యం, మొండితనంతో, కేంద్రం వైఖరికి రైతన్న బలయ్యే పరిస్థితి ముంచుకొస్తోంది..