న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (way2newstv.com)
ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ఎస్‌ఐటీఏ సర్వర్ డౌన్ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి.
ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం,పునరుద్ధరణ
కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఇక, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఎయిరిండియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.దీంతో స్పందించిన ఎయిరిండియా తమ సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించే పనిలో వున్నారని, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది. మెయిన్ సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. ఎయిర్ ఇండియా విమానాల సర్వీసుల పునరుద్దరణ మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్‌లైన్స్ సర్వర్ డౌన్ కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే సాఫ్ట్‌వేర్‌ను రిపేర్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. దీంతో విమానాల పునరుద్దరణ జరగనున్నట్లు చెప్పారు. కానీ కొంత ఆలస్యంగా విమానాల రాకపోకలు జరుగుతాయన్నారు. ఎస్ఐటీఏ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఎయిర్ ఇండియా ప్రయాణికుల సర్వీసులు నడుస్తుంటయాని, అయితే మెయిన్‌టేనెన్స్ సమస్య వల్ల ఆలస్యం జరిగినట్లు ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వానీ లోహనీ తెలిపారు. ఉదయం 8.45 నిమిషాలకు స్టాఫ్‌వేర్‌ను పునరుద్దరించినట్లు ఆయన తెలిపారు.