హైదరాబాద్, ఏప్రిల్ 27, (way2newstv.com)
గత ఐదు రోజులుగా ప్రభుత్వం ట్రయల్ రన్ పేరుతో సందడి చేస్తోందని,ఇంతకీ అది కాళేశ్వరం లో భాగమా? లేక ప్రాణహితలో భాగమా? చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేసారు. శనివారం తన నివాసం లో తెలంగాణ ప్రాజెక్ట్ల ఫై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లోపొన్నాల మాట్లాడుతూ 6,7,8 ప్యాకేజీలు 2011లొనే ప్రారంభం అయ్యాయని,22వందల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు కూడా చేయడం జరిగిందని చెప్పారు.
ఇంతకీ అది కాళేశ్వరం లో భాగమా? లేక ప్రాణహితలో భాగమా?
గతంలో పునాదులు వేసి పనులు ప్రారంభం చేసిన వాటిని పూర్తి చేసి కాళేశ్వరం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.అలాగే మూడు ప్యాకేజీల ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కు రావాల్సిన నీటి పనులు పూర్తి చేసి కాళేశ్వరం అని చెప్పుకుంటున్నారన్నారు.అవి కాళేశ్వరం పనులు కానే కావని,అంబెడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమన్నారు.38వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టును పేరు మార్చి 80వేల కోట్లకువ్యయం పెంచారని దుయ్యబట్టారు.రెండేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్న కేసీఆర్ కు మూడు ప్యాకేజీలు పూర్తి చేయడానికి ఇన్నేళ్లు పట్టిందని పొన్నాల ఎద్దేవా చేసారు.ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి అయినా కాంగ్రెస్ కు పేరొస్తుందని వాటిని ప్రారంభించలేదన్నారు.