ఒంగోలులో హోరాహోరీ పోరే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒంగోలులో హోరాహోరీ పోరే

ఒంగోలు, ఏప్రిల్ 1(way2newstv.com)
ప్రకాశం జిల్లాలో ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ ఒకటి. ఎందుకంటే వరుసగా నాలుగుసార్లు నియోజకవర్గంలో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని 2014 ఎన్నికల్లో దామచర్ల జనార్ధన్ ఓడించారు. ఇక ఈసారి కూడా ఈ ఇద్దరు నేతలే తలపడుతుండటంతో విజయం ఎవరిని వరిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వీరిద్దరు టీడీపీ, వైసీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఉండ‌డంతో ఒంగోలు పోరు మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. 2012 ఉప ఎన్నిక‌ల్లో ఓడిన దామ‌చ‌ర్ల గత ఎన్నికల్లో 13 వేల ఓట్ల తేడాతో బాలినేనిపై విజయం సాధించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి దామచర్ల ప్రజల్లో ఉంటూ…అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ముందున్నారు. అలాగే జిల్లా టీడీపీ నాయకుడుగా నేతలనీ సమన్వయం చేసుకుంటూ…కార్యకర్తలని కలుపుకుని పార్టీని బలోపేతం చేశారు. ఇవే దామచర్లకి ప్లస్ కానున్నాయి. 


ఒంగోలులో హోరాహోరీ పోరే

అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడం మైనస్.ఇక నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉండటం…వైసీపీ బలంగా ఉండటం బాలినేనికి ప్లస్. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆయ‌న నాలుగున్నరేళ్లు హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయ్యార‌న్న విమ‌ర్శ ఉంది. ఆరు నెల‌ల క్రిత‌మే ఒంగోలు వ‌చ్చిన ఆయ‌న ప‌దునైన వ్యూహాల‌తో దూసుకుపోతున్నారు. అటు దామచర్ల మరింత బలపడటం కూడా బాలినేనికి మైనస్‌గా ఉంది. ఇక్కడ జనసేన కొంత ప్రభావం చూపవచ్చు. ఆ పార్టీ అభ్యర్ధిగా షేక్ రియాజ్ ఉన్నారు. ఇక్కడ కాపులు, పవన్ అభిమానులు ఎక్కువ ఉండటం…అభ్యర్ధి ముస్లిం కావడం ప్లస్. అయితే టీడీపీ-వైసీపీ అంత బలంగా లేకపోవడం మైనస్. అయితే కాపుల ఓట్లు చీలితే ప్రధాన పార్టీల్లో ఇద్దరికి దెబ్బే. గ‌త ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు ఎక్కువుగా టీడీపీకే ప‌డ్డాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ టీడీపీకి ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.ఒంగోలు నియోజకవర్గంలో క‌మ్మ, యాద‌వ‌, ఎస్సీ వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. నియోజకవర్గంలో 23 వేల మంది క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు ఉన్నారు. ఇక ఎస్సీ ( మాల, మాదిగలు) 43వేలు ఉన్నారు. తర్వాత కాపు 19 వేలు, యాదవ 23 వేలు, వైశ్య 18వేలు, రెడ్డి సామాజిక వర్గం 15 వేలు , ముస్లింలు 12వేలు ఓట్లు ఉన్నాయి. ఇక దామచర్ల కమ్మ సామాజికవర్గ నేత కాగా..బాలినేని రెడ్డి వ‌ర్గం నేత‌. కమ్మ ఓటర్లు ఎక్కువ తెదేపా వైపున ఉన్నారు. ఇక ఒంగోలు ఎంపీగా శిద్ధా రాఘవరావు ఉండటంతో ఆర్యవైశ్య ఓట్లు దామచర్లకి పడే అవకాశం ఉంది. కాపులు కొంత జనసేనకి, టీడీపీకి మద్ధతు ఉంటారు. ఇక రెడ్డి వర్గం బాలినేని వైపే ఉన్నారు. ముస్లింలు వైసీపీకి, జనసేనకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. బీసీలు మూడు పార్టీలకి ఉన్నారు. నాలుగేళ్ల దామ‌చ‌ర్ల అభివృద్ధికి నాలుగు సార్లు గెలిచి, మాజీ మంత్రిగా ప‌నిచేసిన బాలినేని అనుభ‌వంకు మ‌ధ్య హోరాహోరీగా జ‌రుగుతోన్న ఈ ట‌ఫ్ ఫైట్‌లో ఎవ‌రు గెలిచినా స్వల్ప మెజార్టీయే ఉండే ఛాన్స్ ఉంది.