జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి
పెద్దపల్లి ఏప్రిల్ 03(way2newstv.com)
జిల్లాలో ధాన్యం కోనుగోలును పకడ్భందిగా నిర్వహించాలని, దీనికి అవసరమైన అన్ని ఎర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి పంట కోనుగోలు ప్రక్రియ పై బుధవారం నాడు సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి మాట్లాడుతూ గత సంవత్సరం యాసంగిలో 2,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు అంచనా వేసి ఎర్పాట్లు చేయాగా మొత్తం 1,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కోనుగోలు చేసామని తెలిపారు. 2018-19 యాసంగి పంటలో జిల్లాలోని 48 ఐకేపిసెంటర్లు, 128 ప్రాథమిక వ్యవసాయ కోనుగొలు కేంద్రాలు మొత్తం 176 కేంద్రాల నుంచి సుమారు 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అంచనా వేసి, ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర గ్రేడ్ ఎ రకం రూ.1770, సాధారణ ధాన్యాన్నిరూ.1750 లతో వీటిని కొనుగోలు చేసేందుకు అవసరమైన ఎర్పాట్లు సిద్దం చేయాలని, ఏప్రిల్ 15 నుండి మార్కెట్లో ధాన్యం అమ్మకానికి వచ్చే అవకాశం ఉన్నందున కోనుగోలు ప్రారభానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని జేసి తెలిపారు. వరి కోనుగోలుకు అవసరమైన గొన్నె సంచులను సిద్దం చేసుకోవాలని , జిల్లాలో ప్రస్తుతం వున్న 5,38,991 గొన్నె సంచులకు అదనంగా మరో 57,11,009 గొన్నేసంచులను సిద్దంచేసుకోవాలని, రైస్ మిల్లర్ల వద్ద నుండి గన్ని సంచులు తెప్పించాలని సంయుక్తపాలనాధికారి సూచించారు.
33 ధాన్యం కోనుగోలును పకడ్భందిగా చేపట్టాలి
రైస్ మిల్లర్ల వద్ద నుండి 20 లక్షల గన్నీ సంచులను, రేషన్ షాపు వారి వద్ద నుంచి 60 వేల గన్ని సంచులను ఒకసారి ఉపయోగించిన గన్ని సంచులను టెండర్ ద్వారా 27,30,000 ఏప్రిల్ చివరి నాటికి సమకూర్చుకోవాలని జేసి అధికారులకు తెలిపారు. ధాన్యం కోనుగొలు శిక్షణలో సాంకేతిక అంశాల పై ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 9న శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కోనుగోలు చేసే ధాన్యాన్ని భద్రపర్చడానికి అవసరమైన శాస్త్రీయ గోడౌన్లను గుర్తించి , అందుబాటులోవుంచుకోవాలని , ప్రతి కోనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కోనుగోలుకు అవసరమైన హర్డవేర్, సాప్టవేర్ పరికరాలను సమకూర్చలని తెలిపారు. ధాన్యం కోనుగోలుకు అవసరమైన తరపాలిన్లు, వినోవింగ్మేషిన్లు, ప్యాడిక్లినర్లు, తదితర పరికరాలను అందుబాటులో వుంచుకోవాలని, ధాన్యం కోనుగోలు చేసే చొట మంచి నీటి సరఫరా, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఉన్న ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కనీసం 25 టార్ఫలిన్లు, 1 ప్యాడీక్లీనర్ ఏర్పాటు చేసుకోవాలని జేసి తెలిపారు. జిల్లాలో వున్న రైస్ మిలర్ల వద్ద వున్న మిల్లింగ్ సామర్థ్యాన్నిగుర్తించి, ప్రాథమిక కోనుగోలు కేంద్రాల సమీపంలో గల మిల్లులకు ధాన్యం పంపాలని, ట్రెడింగ్ మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని కేటాయించాలని, బ్లాక్ లిస్టులో చేర్చిన రైస్ మిల్లర్ల కు ఎట్టి పరిస్థితులలో ధాన్యం కేటాయించరాదని సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కోనుగోలుకు సంబంధించి 17 శాతం అంత కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కోనుగోలు చేయడం జరుగుతుందని, దీని పై రైతులకు మంచి ప్రచారం కల్పించాలని, ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొని వచ్చేలా చుడాలని , ఈ విషయం పై గ్రామాలలో డప్పు చాటింపు వేయించాలని జేసితెలిపారు. జిల్లాలోని ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్ద కనీసం 3సభ్యులను అందుబాటులో ఉంచుకోవాలని, వారి వివరాలను ఫోన్ నెంబర్లతో ముందస్తుగా నమోదు చేసుకోవాలని, ధాన్యం కోనుగోలు చేసిన వెంటనే వివరాలను ట్యాబ్లలో ఎంట్రీ చేయాలని జేసి ఆదేశించారు. జిల్లాలో 17 శాతం కంటే తక్కువ తేమ కల్గిన ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాల వారిగా తీసుకొని వచ్చేలా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు సూచించాలని, కోనుగోలు కేంద్రాల వారిగా వ్యవసాయ విస్తరణ అధికారులను ట్యాగింగ్ చేసి సదరు అధికారుల పరిధిలో రైతులు ఆ కోనుగొలు కేంద్రానికి వచ్చేలా చుడాలని జేసి ఆదేశించారు. జిల్లా లోని ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లాలోని ధాన్యం కోనుగొలు కేంద్రాల వద్ద కొంత మంది హమాలీలు రైతుల వద్ద నుండి అధికంగా డబ్బు వసూళ్లు చేస్తున్నారని, దీనిని అధికారులు కట్టడి చేయాలని, వారికి జరపవలసిన చెల్లింపుల పై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని జేసి సూచించారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి రైతు వద్ద నుండి ధాన్యం కోనుగోలు చేయాలని , వేసవిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అమె అధికారులను ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్ రెడ్డి, జిల్లావ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, ఐకేపి కేంద్రాల ప్రతినిధులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, సంబంధితఅధికారులు, తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు.