సూర్యాపేట ఏప్రిల్ 23, (way2newstv.com)
ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ. విద్యార్థులు, తల్లి దండ్రులు ఆందోళన చెందవద్దు. అపోహలను నమ్మవద్దని విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అందరికీ న్యాయం జరుగుతుంది..
ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు
విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అన్నారు. అనుమానాలు ఉన్న వాళ్ళు రీ వాల్యూషన్ కు అప్లై చేసుకోండి. ఈ విషయంపైఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సాంకేతిక తప్పిదాలు ఉంటే సంస్థ పైన, మానవ తప్పిదం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు లను , తల్లిదండ్రులను రెచ్చగొట్టే లా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని అన్నారు.