జూన్ 1 నాటికి పుస్తకాలు రెఢీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూన్ 1 నాటికి పుస్తకాలు రెఢీ

హైద్రాబాద్, మే 14, (way2newstv.com)
విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందిపడకుండా.. పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉంచేందుకు ముందుగానే ముద్రణ ప్రారంభించి.. వాటిని జిల్లాలకు చేరవేసే చర్యలు చేపట్టింది. 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.జిల్లా కేంద్రాలకు చేరుకున్న పాఠ్య పుస్తకాలను త్వరలోనే మండలాలవారీగా పంపిణీ చేయనున్నారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు అందించనున్నారు. ఈ పుస్తకాలన్నింటినీ జూన్ 1వ తేదీన పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు అందజేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. 


 జూన్ 1 నాటికి పుస్తకాలు రెఢీ

విద్యార్థులకు అందజేసిన పుస్తకాలను వారు అమ్ముకోకుండా, వాటిపై క్రమ సంఖ్యతోపాటు ప్రభుత్వ పుస్తకాలు ఉచితంగా అందజేసినట్లు సూచించే లోగోను ముద్రించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అం దించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభు త్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ పాఠ్యపుస్తకాలు కేవ లం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వద్ద మాత్ర మే ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపట్టారు.ప్రతి ఏడాది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. దీంతో చదువు అభ్యసించడం కష్టంగా మారుతోంది. కొందరు నిరుపేద విద్యార్థులు ప్రైవేట్‌గా పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి చదువుకోవాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగుస్తుండడం, అవసరమైన వాటిలో సగం పుస్తకాలు మాత్రమే అందుతుండడం వంటి చర్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. అయితే, ప్రభుత్వం విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పుస్తకాలు విద్యార్థులకు చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.2019-20 విద్యా సంవత్సరం జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అప్పట్లోగానే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చేరనున్నాయి. ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయనే దానిపై జిల్లాల విద్యాశాఖాధికారులు పాఠశాలలవారీగా వివరాలను విద్యాశాఖకు పంపించారు. దీని ఆధారంగా పాఠ్య పుస్తకాలు జిల్లాలకు చేరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.45 కోట్ల ఉచిత పాఠ్య పుస్తకాలు అవసరం కాగా,ఇప్పటికే దాదాపుగా అవసరమైన పాఠ్య పుస్తకాలలో చాలా వరకు ముద్రణ పూర్తి చేసి జిల్లా పాయింట్లకు పంపించగా, మిలిగిన పుస్తకాలను కూడా పంపిస్తున్నారు. అలాగే సేల్ పుస్తకాలను జిల్లాల్లో డిఇఒ గుర్తించిన బుక్ షాపుల్లో గత నెల 10 నుంచే అందుబాటులో ఉంచారు. వచ్చే విద్యాసంవత్సరానికి అవసరమైతే 1.19 సేల్ పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచామని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు జిల్లాల్లో ఆయా బుక్ షాపుల నుంచి ఎంఆర్‌పి ధరకు కొనుగోలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలన్న చట్టం నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం గత విద్యాసంవత్సరం నుంచి అమలవుతోంది. తెలుగు అమలు ప్రతి ఏటా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఒక్కో తరగతి పెరుగుతూ వస్తోంది. గత విద్యాసంవత్సరం 1,6 తరగతులకు పుస్తకాలను రూపొందించగా, ఈ సారి 2,7 తరగతులను పాఠ్యపుస్తకాలను ము ద్రించారు. 1,2,6,7 తరగతులకు సంబంధించిన తెలు గు సేల్ పుస్తకాలు ఈ నెల 10 నుంచి జిల్లాల్లో డిఇఒ గుర్తించిన బుక్ షాపులలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలతోపాటు, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్ పాఠశాలలు తెలుగును సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. తెలుగు మీడియంతో పాటు ఇతర మీడియంలకు చెందిన విద్యార్థులు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది.