జూన్ 7 న రాష్ట్ర రైతు సమ్మేళనం


గుంటూరు మే 27, (way2newstv.com)
గుంటూరు కొత్తపేటలో సిపిఐ నేతలు మీడియాతో మాట్లాడారు.  నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో 65 శాతానికి పైగా ప్రజలు నేటికీ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తూ బ్రతుకుతున్నారని తెలిపారు మన ఆర్థిక ప్రగతికి పునాదులు వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడంలో పాలకులు విఫలమయ్యారని తెలిపారు. 


జూన్ 7 న రాష్ట్ర రైతు సమ్మేళనం
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో రైతన్నల గోడు పట్టించుకునే నాధుడు లేడు అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సమ్మేళనం 2018 జూన్ 7 8 9 తేదీలలో గుంటూరులో వి ఎస్ కె హాలులో రాష్ట్రస్థాయి సమ్మేళన కార్యక్రమాలు మూడు రోజులపాటు జరుగును కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అందరూ కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్,  ముసునూరు రమేష్ బాబు, రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post