సింగనమలలో విజయలక్ష్మీ వరించేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సింగనమలలో విజయలక్ష్మీ వరించేనా

అనంతపురం, మే 16, (way2newstv.com)
డీపీ కంచుకోట జిల్లా అయిన అనంత‌పురం జిల్లాలోని ప్రముఖ రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల‌. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున గ‌తంలో శ‌మంత‌క‌మ‌ణి విజ‌యం సాధించారు. వైఎస్ హ‌యాంలో సాకే శైల‌జానాథ్ విజ‌యం సాధించారు. ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌ని కార‌ణంగా తాను ఎమ్మెల్సీగా ప‌రిమిత‌మైన శ‌మంత‌క‌మ‌ణి.. ఆ ఎన్నిక‌ల్లో తొలిసారి త‌న కుమార్తెను రంగంలోకి తీసుకువ‌చ్చి గెలిపించుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన యామినీబాల‌కు ఆ త‌ర్వాత త‌ల్లితోనే విబేధాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత యామినీబాల‌కు కాకుండా త‌న కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు శ‌మంత‌క‌మ‌ణి విశ్వప్రయ‌త్నాలు చేశాడు. అయితే జేసీ దివాక‌ర్‌రెడ్డి శ‌మంత‌క‌మ‌ణి ఫ్యామిలీని పూర్తిగా ప‌క్కన పెట్టేలా బాబుపై ఒత్తిడి తేవ‌డంలో స‌క్సెస్ అయ్యారు.ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పోటీ చేశారు.ఈ మె 2014 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. 4584 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. 


సింగనమలలో విజయలక్ష్మీ వరించేనా

తాను ఓడిపోయినా కూడా మ‌రింత క‌సిగా ప‌ద్మావ‌తి ప్రజ‌ల్లో నే ఉండ‌డం ఇప్పుడు ఆమెకు క‌లిసి వ‌చ్చిన అవ‌కాశం. తాజా ఎన్నిక‌ల్లో యామినీబాల‌ను త‌ప్పించిన చంద్రబాబు బండారు శ్రావణికి అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఈమెకు ఇవే తొలి ఎన్నిక‌లు కావ‌డం, ప్రజ‌ల‌కు ఆమె ఫేస్‌కూడా కొత్తకావ‌డం గ‌మ‌నార్హం. బండారు శ్రావణి ఫ్యామిలీకి రాజ‌కీయ అనుభ‌వం ఉండడ‌మే ఆమెకు కాస్తో కూస్తో క‌లిసొచ్చే అంశం. అదే స‌మ‌యంలో ప‌ద్మావ‌తిని తిరిగి రంగంలోకి దింపిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇక్కడ ఎట్టిప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగారు. ఆర్దికంగా కూడా ఆమెకు అన్ని విధాలా అండ‌గా నిలిచారు. దీంతో ప‌ద్మావ‌తి పుంజుకున్నారు.ముఖ్యంగా గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ప్రజ‌ల మ‌ధ్యే ఉంటూ.. ఎమ్మెల్యేపై పోరాటాలు చేయ‌డంలో ప‌ద్మావ‌తి స‌క్సెస్ అయ్యారు. జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు, పార్టీ మేనిఫెస్టోను ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో జిల్లాలో స‌క్సెస్ అయ్యేందుకు ప‌ద్మావ‌తి కూడా కృషి చేశారు. మొత్తంగా జ‌గ‌న్ దృష్టిలోనే కాకుండా పార్టీ ప‌రిశీల‌కుల దృష్టిలోనూ ప‌ద్మావ‌తి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వంపై త‌ర‌చుగా విమ‌ర్శలు చేస్తూ.. వార్తల్లోనూ నిలుస్తున్నారు. దీంతో శింగ‌న‌మ‌ల‌లో ప‌ద్మావ‌తి గెలుపు ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక‌, టీడీపీలో పెద్ద‌గా ఆశ‌లు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు టికెట్ ఇవ్వలేద‌నే అక్కసుతో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ.. ప్రచారానికి దూరంగా ఉండ‌డం పార్టీని ఇబ్బంది పెట్టింది.జేసీ చివ‌ర్లో బాబుపై ఒత్తిడి తేవ‌డంతో బండారు శ్రావ‌ణికి ఆఖ‌ర్లో సీటు వ‌చ్చింది. అప్పటికే ఐదేళ్ల పాటు యామినిబాల తీరుపై విసిగిపోయి ఉన్న టీడీపీ శ్రేణులు పార్టీ గెలుపుకోసం క‌సితో ప‌నిచేయ‌లేదు. కొంద‌రు లోపాయికారిగా వైసీపీకి కూడా స‌హ‌క‌రించారు. ఇక బీసీల్లో ఈ సారి మార్పు స్పష్టంగా వ‌చ్చింది. అనంత‌పురం జిల్లాలో రెండు ఎంపీ సీట్లు వైసీపీ బీసీల‌కు ఇవ్వడంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో కొంద‌రు వైసీపీ వైపు మొగ్గు చూప‌డం క‌న‌ప‌డింది. మొత్తంగా చూసుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వైసీపీ అంచ‌నాలు, స‌ర్వేల అంచ‌నాల‌ను బ‌ట్టి జొన్నల‌గ‌డ్డ గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు.