హైద్రాబాద్, మే 20, (way2newstv.com)
ఓ ప్రక్క ఎన్డీయే ,మరోప్రక్క యూపీఏ మధ్యలో ఫెడరల్ ఫ్రంట్ ఇంతకీ ఏ కూటమికి అధికారం దక్కనుంది. ఫెడరల్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు లో కింగ్ మేకర్ కాబోతుందా.కేసీఆర్ అంచనాలకు భిన్నంగా ఎన్డీయే నో...లేదంటే యూపీఏ నో మెజారిటీ సీట్లు గెలిస్తే పరిస్థితి ఏంటి. అలాంటి పరిస్థితి వస్తే కేసీఆర్ ఏ కూటమిలో జాయిన్ అవ్వబోతున్నారు. మే 23 నా ఎంపీల భవితవ్యంబయటపడనుంది.అంతేకాదు కేంద్రంలో అధికార పగ్గాలు ప్రజలు ఎవరికి ఎవ్వబోతున్నారు అనేది అదే రోజు తెలిపోనుంది. కాంగ్రెస్,బిజెపి లాంటి జాతీయ పార్టీలు అధికారం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూ ఉరుతున్నాయి. భారీ మెజారిటీ తో మళ్ళీ అధికారంలోకి రబోతున్నామని బిజెపి పార్టీ ధీమాతో ఉంది..అలాగే బిజెపి కి 100 అతి తక్కువ సీట్లు వస్తాయని తమ కూటమిని అధికారంలోకి వస్తోంది అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అని బలంగా నమ్ముతున్నారు. దేశంలో హాంగ్ ఏర్పాటు అవ్వడం ఖాయం అని అంటున్నారు టి ఆర్ యస్ పార్టీ అధినేత కేసీఆర్ హంగు వస్తోంది అని ధీమాగా చెబుతున్న అధికారంలోకి వచ్చేది ఎవరనే దానిపై పూర్తి దృష్టి పెట్టారు కేసీఆర్. యూపీఎ కూటమి అధికారంలోకి వస్తోందా....లేదంటే యన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తోందా అనే దానిపై మనసు పెట్టారు.
ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ పాత్ర
ఏ కూటమి అధికారంలోకి వస్తోందో అదే కూటమిలో చేరాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుకోవడానికే కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన చేసారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.వీలు అయితే యూపీఎ లో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పార్టీ లో చర్చ నడుస్తోంది. గతంలో మమత బెనర్జీ, ,అఖిలేష్ యాదవ్,నవీన్ పట్నాయక్ లను కూడా సమాచారం తెలుసుకోవడానికి కలిసారని రాజకీయ వర్గాల్లో చర్చ ఫెడరల్ ఫ్రంట్ గొడుకు కిందకు ఇప్పుడున్న పరిస్థితిలో వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరూ వచ్చేలా కేసీఆర్ కి కనిపించడం లేదు.కాబట్టి జగన్ ను కలుపుకొని అధికారం లోకి వచ్చే కూటమికి వెళ్ళితేనే మంచిది అని నిర్ణయానికి కేసీఆర్ వచిన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అందుకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతోందా..బిజెపి కూటమి అధికారంలోకు రాబోతోందా తెలుసుకొనే పనిలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ గట్టుకు వెళ్లాలా ,ఆ గట్టుకు వెళ్ళాలి అంటే ఎవరిద్వారా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అంట. మరోవైపు బిజెపి కూటమినే మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ కూటమికి జై అనాలా అనేది టి ఆర్ యస్ పార్టీ అధినేత చూస్తున్నారు. ఒకవేళ బిజెపికి సపోర్ట్ చెయ్యాల్సి వస్తే మిత్ర పక్షం ఏం ఐ యం ఎలా రియాక్ట్ అవుతుంది అని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.ఏ గట్టుకు వెళ్లాలనో త్వరగా తేల్చుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ కూటమికి వెల్లలనా, బిజెపి కూటమికి వెల్లలనా ఆలోచన చేసుకునే పని లో కేసీఆర్ నిమగ్నం అయ్యారు.ఏ గట్టుకు వెళ్లలో మే 23 రోజున వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఏ గట్టుకు వెళ్ళాలనే నిర్ణయం తర్వాత తీసుకోవాలి..కానీ ఆ గట్టుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకోనే పనిలో టి ఆర్ యస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు..మరి కేసీఆర్ ఏ గట్టుకు వెల్లుతారో తెలియాలి అనేది ఫలితాలు వెలువడే వరకు చూడాల్సిందే
Tags:
telangananews