ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త చిక్కులు


నల్గొండ, మే 20, (way2newstv.com)
ఎమ్మెల్సీ గా అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ నేతలకు కొత్త చిక్కొచ్చిపడింది. మూడేళ్ల పదవి కోసం పోటీ పడుతున్న నేతలుకు ఖర్చు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓ వైపు పదవికోసం ఆరాటం మరోవైపు ఎంత ఖచ్చవుతోందన్న భయం వెంటాడుతోంది. పదవి కాలం అయిపోతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఓటర్లు పెద్ద ఆశలతో ఉండటంతో ఎమ్మెల్సీ అభ్యర్దుల  వారిని తమవైపు తిప్పుకోవడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది.స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అభ్యర్దులను ప్రకటించాయి.  మూడు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఎమ్మెల్సీ పదవికోసం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీ పడి అభ్యర్దులను ప్రకటించారు. మూడు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలువాలని పార్టీలన్నీ అర్దికంగా బలమైన అభ్యర్దులను బరిలో నిలిపాయి.



ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త చిక్కులు 

అయితే అభ్యర్దులు మాత్రం ఎన్నికల ఖర్చు విషయంలో మాత్రం ఓ అంచనాకు రాలేక పోతున్నారుని తెలుస్తోందఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిసియో సభ్యులుకు ఓటు హక్కు ఉంటుంది. ఉమ్మడి  నల్గొండ జిల్లా లో 1086, వరంగల్ జిల్లాలో 902, రంగారెడ్డి జిల్లాలో 812మంది ఓటర్లు ఉన్నారు.  ఇందులో ఎంపీటీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే   జెడ్పీటీసీ, ఎంపీటీసీల  పదవికాలం జులై ఏడున ముగుస్తోంది. వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి  ఇదే చివరి అవకాశం. దీంతో ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఉవ్విల్లూరుతున్నారు.అయితే మోజార్టీ ఓటర్లు తమను ఆదరించే  వాల్లకే ఓటు వేసిన సంద్భాలు గతంలో ఉన్నాయి. గంతలో నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప రెడ్డి, కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడ్డారు. క్యాంపు రాజకీయాలు ఇరువర్గాలు నిర్వహించిన కోమటి రెడ్డినే విజయం వరించింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి మళ్లీ తేరా చిన్నపరెడ్డి రంగంలో ఉండగా అటు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి  లక్ష్మీ బరిలో ఉన్నారు. ఇక  రంగారెడ్డిలో సేమ్ సీన్ రిపీట్ అయింది. గతంలో  పట్నం మహేందర్ రెడ్డి తమ తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించుకోగా...ఈసారి తానే రంగంలో ఉన్నారు.  అటు గతంలో  ఉమ్మడి  వరంగల్ల్  జిల్లా కొండా మురళి లోకల్ బడీ ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా గెలిచారు. కొండా మురళి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్  పార్టీలోకి మారడంతో...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహిత్లు పోచంపల్లి. శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లోనే పోచం పల్లిని గెలిపించాలని కేటీఆర్ వరంగల్ జిల్లా నేతలుకు ఆధేశించారు. టీఆర్ఎస్ అభ్యర్ది పోచం పల్లికి పోటీగా ఇనగాల వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బరిలో నిలిపారు. ఇక  నామినేషన్ల పర్వం ముగియగానే క్యాంపు రాజకీయాలకు నేతలు తెరలేపనున్నారు అన్ని పార్టీల నేతలు.పరిస్థితులుకు ముందే ఊహించినా రాజకీయా పార్టీలు బిగ్ షాట్స్ ను రంగంలోనికి దింపాయి. తమ అభ్యర్దులు గెలుపుకోసం ఎందాకైన పోయోందుకు ఉవ్విల్లూరుతున్నాయి. జరిగేవి ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలంటే ఎక్కవ ఉత్కంఠకు గరిచేస్తున్నాయి.
Previous Post Next Post