ఫణి ప్రభావంతో మరింతగా ఎండలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫణి ప్రభావంతో మరింతగా ఎండలు

హైద్రాబాద్, మే 4, (way2newstv.com)
అసలే మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ. సమ్మర్ వస్తే మనం పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతుంటే... అవి మరింత పెరిగేందుకు కారణమవుతోంది ఫొణి తుఫాను. అదేంటి తుఫాను వస్తే, వాతావరణం చల్లబడుతుంది కదా అన్న డౌట్ మనకు రావచ్చు. అది ఒకట్రెండు రోజులే. తుఫాను వెళ్లిపోయిన తర్వాత అంటే సోమవారం నుంచీ ఎండల తీవ్రత మరింత పెరగబోతోంది. కారణం ఫొణి తుఫానే. అది రాకముందు వరకూ వాతవరణం ఓ పద్ధతిలో ఉంది. ఎప్పట్లాగే సమ్మర్ ఎండలు కొనసాగేవి. కానీ ఫొణి రావడం వల్ల వాతావరణంలో నీటి ఆవిరిలో హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో భూమి మరింత సెగలు కక్కుతుంది. భూమిపై నుంచీ నీటి ఆవిరి ఆకాశానికి వెళ్తుంటే... మనకు ఉక్కపోత విపరీతంగా పెరుగుతుంది. 


ఫణి ప్రభావంతో మరింతగా ఎండలు

దీనికి తోడు పశ్చిమం నుంచీ వచ్చే వేడిగాలులు మనకు ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 42 డిగ్రీల ఎండ ఉంటోంది. తాజాగా ఒంగోలులో అది 43.7 డిగ్రీలుగా నమోదైంది. ఈ నెలలో ఎండలు పెరగడం సహజమే. ఐతే... లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు మరింత ఎక్కువ తీవ్రత ఉండబోతోంది. అందువల్ల మనం అలర్ట్‌గా ఉండాలి. వీలైనంతవరకూ ఎండలో తిరగకుండా జాగ్రత్త పడాలి. వాటర్ ఎక్కువ తాగాలి. అలాగే... బాడీలో షుగర్, సాల్ట్ లెవెల్స్ బ్యాలెన్స్‌గా ఉండేలా చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వాటర్ తాగాలి. బాడీ కూల్‌గా ఉండేందుకు చలవ చేసే ఆహార పదార్థాలూ, పండ్ల రసాలూ, ద్రవాలూ తీసుకోవాలి. వడ దెబ్బ తగలకుండా తరచూ వాటర్ తాగుతూ ఉండాలి.అలసటగా, నీరసంగా ఉండేవారు వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఫొణి తుఫాను వల్ల పెరిగే ఎండ తీవ్రత తిన్నగా బ్రెయిన్‌పై ప్రభావం చూపిస్తుంది. తిన్న ఆహారం అరగదు. వికారంగా ఉంటూ, వామ్టింగ్స్ వచ్చేలా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చి, కళ్లు తిరుగుతాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే ఎండ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిందే