అచ్చెన్నాయుడికి రెండో సెంటిమెంట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అచ్చెన్నాయుడికి రెండో సెంటిమెంట్

శ్రీకాకుళం, మే 1, (way2newstv.com)
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే వీటిని నమ్మేవారి సంఖ్య, వీటిని ఫాలో అయ్యేవారి సంఖ్య రాజకీయాల్లో ఎక్కువగానే కనిపిస్తుంటుంది. అయితే సెంటిమెంట్లను, చరిత్రను తిరగరాస్తామనే నమ్మకం కొందరితో ఉంటుంది. అలా సెంటిమెంట్‌ను అధిగమిస్తాననే నమ్మకంతో బరిలోకి దిగిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ సారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారా లేదా అన్న అంశంపై శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 


అచ్చెన్నాయుడికి రెండో సెంటిమెంట్

ఇందుకు ప్రధాన కారణం టెక్కలి నుంచి ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి విజయం సాధించకపోవడమే.అప్పుడెప్పుడో ఓ అభ్యర్థి వరుసగా ఒకరు రెండుసార్లు గెలవడం తప్పితే... ఇప్పటివరకు ఒకే అభ్యర్థి రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అచ్చెన్నాయుడు ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా లేక బ్యాడ్ సెంటిమెంట్‌కు రాజకీయంగా దెబ్బతింటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని అచ్చెన్నాయుడు ధీమాగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టెక్కలి సెంటిమెంట్ మరోసారి రిపీటైతే... తమ నాయకుడికి ఓటమి తప్పదేమో అనే ఆందోళన ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టెక్కలి సెంటిమెంట్ ఈ సారి తమకు కలిసొస్తుందని విపక్ష వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి సెంటిమెంట్‌ను అధిగమిస్తారా లేదా అన్నది తెలియాలంటే ఈ నెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే.