ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

ఆర్డీవో వెంకటనారాయణమ్మ
నంద్యాల మే 13, (way2newstv.com)
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయం లో సోమవారం నాడు జరిగిన ప్రజాదర్బారులో ఆర్డీవో సి వెంకటనారాయణమ్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రజా దర్బార్ కూ వస్తుంటారని అన్నారు. అటువంటి వారికి ఈ ప్రజా దర్బార్ ఎంత గానో ఉపయోగపడతుందని అన్నారు. ప్రజా దర్బార్ లో స్పీకరించిన వినతులను ఆన్ లైన్ లో నమోదు చేసి వినతి దారులకు రసీదు కూడా ఇస్తామని అన్నారు. 

 
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

స్పీకరించిన వినతులను  సంబంధించిన శాఖల వారికి పంపించి పరిష్కరిస్తామని అన్నారు. కొన్ని సమస్యలను తహసీల్దార్ చరవాణి ద్వారా పరిష్కారం చేసామని తెలిపారు. సోమవారం జరిగిన ప్రజాదర్బారులో మా భూములను అడంగల్ లో నమోదు చేయాలని,  అన్న దాత సుఖీభవ డబ్బులు పడలేదని, వితంతు పింఛన్లు, ని. భూములు సర్వే చేయించాలని పలువురు వినతులు ఇచ్చారిని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్, మండల కేంద్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సోమవారం నాడు జరిగిన ప్రజాదర్బారులో 6 వినతులు వచ్చాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీయస్ ఓ అల్లిపీరా. డీటి సుభాకర్. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు