రూపాయికే దహనసంస్కారాలు


అభినందనలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య 
కరీంనగర్‌ మే 21  (way2newstv.com
కరీంనగర్‌ పట్టణం లో  ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామని కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌..  పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. వచ్చే 15లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 



రూపాయికే   దహనసంస్కారాలు

‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పేదలకు భారం కలగకుండా దాతల సాయంతో నిధులు సమకూర్చుతామని తెలిపారు. నగర పాలక ద్వారా రూ.1.10కోట్లు కేటాయించామని, రూ.50లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని చెప్పారు. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు.అభినందనలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న పథకం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆకర్షించింది. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పథకం వివరాలను తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు.  
Previous Post Next Post