ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఓట్లను పక్కాగా లెక్కించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఓట్లను పక్కాగా లెక్కించాలి

కేంద్ర ఎన్నీకల సంఘం ఐటి డైరెక్టర్ వి.ఎన్.శుక్లా 
పెద్దపల్లి ,  మే 03 (way2newstv.com)
 సాధారణ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఆ నియోజకవర్గంకు చెందిన సర్వీస్ ఒటర్లకు అందించిన  ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఒట్ల లెక్కింపు  నిబంధనల  కమిషన్ నిబంధనల మేరకు పకడ్భందిగా నిర్వహించాలని  కేంద్ర ఎన్నికల సంఘం ఐటి డైరెక్టర్ వి.ఎన్ .శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు.  కౌంటింగ్ ప్రక్రియ,  ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఒట్లు లెక్కింపు విధానం సంబంధిత అంశాల పై  శుక్రవారం ఆయన అన్నీ పార్లమెంట్ పరిధిలోని  ఉన్నతాధికారులతో  దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ  దేశంలో 7 దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయని, వీటికి ఫలితాలు మే 23,2019న విడుదల చేయడం జరుగుతుందని  తెలిపారు. 


ఎలక్ట్రానిక్  పోస్టల్ బ్యాలేట్ ఓట్లను పక్కాగా లెక్కించాలి 

సర్వీస్ ఒటర్లకు, వారి  జీవిత భాగస్వాములకు, ఇతర దేశాలలో నివసిస్తున్న వారికి  ఎలక్ట్రానిక్ పద్దతి ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా  ఎలక్ట్రానికల ట్రాన్సమిటడ్ పోస్టల్ బ్యాలేట్  సిస్టంను  ఎన్నికల కమిషన్ రూపొందించిందని,  దీనిలో  పాస్ వార్డు, క్యూఆర్ కోర్డు వంటి అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ డుప్లికేటు తయారు చేయడానికి వీలు లేకుండా   ఒటు  హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన  తెలిపారు.  ఎన్నికల కౌంటింగ్ సమయంలో వీటిని సైతం  పకడ్భందిగా, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు లెక్కించాల్సి ఉంటుందని, మీ  పార్లమెంట్ నియోజవకవర్గానికి సంబంధించిన  ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఒట్లను  ముందుగా  స్కాన్ చేసి ఫారం 13 సి ద్వారా వెరిఫై చేసుకోవాలని, నిబంధనలకు వ్యతిరేకంగా  ఉంటే వెంటనే వాటిని తిరస్కరించాలని  తెలిపారు.  ఫారం 13 సి వెరిఫై చేసిన అనంతరం సదరు ఒటరు  మీ పార్లమెంట్ పరిధిలోకి వస్తాడా, ఆ ఓటరు యొక్క డిక్లరేషన్,  తదితర వివరాలను పూర్తి స్థాయిలో  సరిచూసుకోవాలని  తెలిపారు.  కౌంటింగ్ సమయంలో ఉండే కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందికి క్రమ సంఖ్య ఎర్పాటు చేసి   ఎలక్ట్రానిక్  పోస్టల్ బ్యాలేట్ ఓట్లను  పక్కాగా లెక్కించేలా  వారికి ముందస్తు అవగాహన  శిక్షణ కార్యక్రమాలను  నిర్వహించాలని  తెలిపారు.  ఎన్నికల కౌంటింగ్ కు సైతం అవసరమైన అన్ని ఎర్పాట్లను  కట్టుదిట్టంగా  చేయాలని, మంచి భద్రత ఉండేలా చూసుకోవాలని  తెలిపారు. అనంతరం  సమీక్షలో  అధికారులకు  ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలేట్ ఓట్ల విషయంలో పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ అధికారుల సందేహలను నివృత్తి చేయడం జరిగింది.జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి,  పెద్దపల్లి ఆర్డివో ఉపెందర్ రెడ్డి, మంథని ఆర్డివో కె.నగేష్,  బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పి.ఎస్. రాహుల్ రాజ్, చెన్నూరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్,  మంచిర్యాల  అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారి సురేష్,  సంబంధిత అధికారులు, తదతరులు ఈ దూరదృశ్య సమీక్షలో  పాల్గోన్నారు.