సంగారెడ్డి మే 13, (way2newstv.com)
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇంత పెద్ద ఘటన జరిగాక కూడా వాహనాదారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కంది మండల గణేష్గడ్డ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ప్రమాదంలో ఆమె శరీరభాగాలు తెగిపడి మృతదేహం నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు ర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా.. మృతి చెందిన మహిళ ఎవరు..? ఇంతకీ మహిళను ఢీ కొన్న వాహనం ఏది..? గుర్తు తెలియని వాహనమే ఢీకొన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.