తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా కోరడంతో కేసీఆర్ చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్
వేదమంత్రాలు, సన్నాయి మేళంతో సాంప్రదాయబద్దంగా కేసీఆర్ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత కేసీఆర్.. రేణిగుంట ఎయిర్ పోర్ట్కు తిరుగు ప్రయాణమయ్యారు.
Tags:
Andrapradeshnews