హైద్రాబాద్, మే 4, (way2newstv.com)
రంజాన్ మాసం నేపథ్యంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు మసీదులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రార్థనలు నిర్వ హించుకోవడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు పూర్తి దశకు చేరుకున్నారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలో చారి త్రక మక్కామసీదు (చార్మినార్), రాయల్‌మసీదు (పబ్లిక్‌గార్డెన్స్)ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం విరివిగా నిధులను కేటాయించింది. ఈ రెండు మసీదులు పూర్తిగా ప్రభుత్వ ఆదీ నంలో ఉన్నాయి. 400 ఏండ్ల చరిత్ర కలిగిన మక్కామసీదు, 100 ఏండ్ల చరిత్ర కలిగిన రాయల్‌మసీదుల నిర్వహణ భారంతో కూడి ఉండటంతో నిజాం అప్పట్లోనే వీటిని ప్రభు త్వ పరం చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వమే నిధులను కేటాయిస్తూ వస్తున్నది. 2018-19 సంవత్సరానికి రూ. 3.19 కోట్లను మంజూరుచేసింది. ఇక 2019-20 సంవత్సరానికి సైతం 1.75 కోట్లను విడుదల చేసింది.
కిల్లికి కాలం కలిసొచ్చేనా
దీంట్లో రూ. 1.48 కోట్లను రెండు మసీదుల నిర్వహణ కోసం వెచ్చించనుండగా, రూ. 39 లక్షలను కేవలం రంజాన్ మాసం దృష్ట్యా ఖర్చుల కోసం కేటాయించింది. ఈ నిధులతో రెండు మసీదుల్లో 26 మైనర్ వర్క్స్‌ను చేపట్టి పూర్తిచేశారు. ఇదిలా ఉండగా, మసీదుల పునరుద్ధరణ, సంరక్షణ నిమిత్తం రూ. 3 కోట్లను విడుదల చేయగా, ఆయా పనులు ఆర్కియాలజీ విభాగం సంచాలకుల పరిరక్షణలో కొనసాగుతున్నాయి. ఈ పనులు పురోగతిలో ఉన్నట్లుగా మహ్మద్ ఖాసీం ప్రకటించారు.రంజాన్ ఉపవాస దీక్ష విరమణ కోసం ముస్లింలు ఖర్జురాలను వినియోగిస్తారు. ఉదయం, రాత్రి వేళల్లో ఖర్జురాలను పుచ్చుకుని దీక్ష విరమిస్తారు. దీని దృష్ట్యా జిల్లా మైనార్టీ సం క్షేమశాఖ ఉచితంగా ఖర్జురాలను పంపిణీచేస్తున్నది. మక్కామసీదు వద్ద వెయ్యి కిలోలు, రాయల్‌మసీదు వద్ద 500 కిలోల ఖర్జురాలను ఉచితంగా అందజేయబోతున్నారు. ఇది వరకు మక్కా మసీదు వద్ద మాత్రమే ఉచితంగా ఖర్జురాలను అందజేయగా, ఈ ఏడాది నుంచి రాయల్‌మసీదు వద్ద సైతం ఉచితంగా ఖర్జురాలను పంపిణీచేయబోతున్నారు. మసీదుల్లో ప్రార్థనల నిమిత్తం 400 చదరపు ఫీట్లల్లో కాయిర్ ఫుట్‌మ్యాట్ ఏర్పాటు,800 చదరపు ఫీట్ల విస్తీర్ణంలో సింతటిక్ మ్యాట్ ఏర్పాటు చేశారు.మసీదుల్లో పరిశుభ్రమైన తాగునీటి వసతి కల్పించడంతో పాట ఒక్కో మసీదులో 10 మంది చొప్పున తాత్కాళిక సిబ్బందిని నియమించారు. ఇక మసీదులోని ట్యాంకులను శుభ్రపరచడం కెమికల్స్ కొనుగోలుచేశారు.