నిదానంగా.. నీరసంగా (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిదానంగా.. నీరసంగా (కర్నూలు)

కర్నూలు, మే 27 (way2newstv.com): 
కేసీ ఎత్తిపోతల పథకం ప్రారంభమయి రెండేళ్లు గడిచినా లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. సాగునీరు అందక ఎగువ పొలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్యం నెరవేరితే రెండు కార్ల పంటలను పండించుకోవచ్ఛు ఒక్క పంటకే కనాకష్టమవుతోంది. రూ.190 కోట్లు వెచ్చించినా పూర్తిస్థాయిలో ప్రయోజనం లేకుండాపోయింది.నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి శివారులో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కర్నూలు-కడప కాల్వ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం నుంచి కృష్ణానది నీటిని కేసీ కాల్వకు ఎత్తి పోసి 0 కి.మీ వరకు తరలించి వాడుకోవాలి. కానీ నీరు 40 కి.మీ వరకు మాత్రమే వెళుతోంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి అనుసంధానంగా కేసీ పథకాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జలాలను కర్నూలు-కడప కాల్వకు ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని రూ.190 కోట్ల వ్యయంతో నిర్మించారు. నాలుగు మోటర్లు, పైపులైన్‌, ముచ్చుమర్రి వద్ద కేసీ కాల్వలో గేట్లు ఏర్పాట్లు చేశారు. 

నిదానంగా.. నీరసంగా (కర్నూలు)
ముచ్చుమర్రి నుంచి 0 కి.మీ వరకు నీరు చేరేందుకు అల్లూరు, పడిదెంపాడు గ్రామాల వద్ద కేసీ కాల్వపై గేట్లు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసేందుకు రెండు మోటర్ల చొప్పున నిర్మించారు. ముచ్చుమర్రి వద్ద కాల్వకు నీరు ఎత్తి పోసే సమయంలో గేట్లను కిందకి దించుతారు. గ్రావిటీపై అల్లూరు వరకు వెళుతుంది. అక్కడ రెండు మోటర్లతో ఎత్తిపోయడం వల్ల పడిదెంపాడు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన మోటర్ల ద్వారా నీటిని ఎత్తి పోయడంతో గ్రావిటీ ద్వారా 0 కి.మీకు చేరుకుంటాయి. ఈ నీటిని కేసీ ఆయకట్టుకు విడుదల చేయాలి. ఈ లక్ష్యం చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కర్నూలు-కడప కాల్వకు కేటాయించిన నీటి వాటాలో వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 టీఎంసీలను అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఆ వాటాను భర్తీ చేసేందుకు ఆ ప్రభుత్వ హయాంలోనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా కృష్ణానీరు 0 కి.మీ వరకు చేరడం లేదు. సుంకేసుల 0 కి.మీ నుంచి 120 కి.మీ వరకు వెళ్లే నీటితోనే పంటలు పండించుకుంటున్నారు. 15 ఏళ్ల కిందట వరకు 0 నుంచి 120 కి.మీ కేసీ ఆయకట్టు కింద రెండు కార్లు కర్నూలు సన్నాలు రకం వరి పండించే వారు. కేసీ నీటి వాటాలో 5 టీఎంసీలు కోత పడడంతో సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత 15 ఏళ్లలో కేసీ ఆయకట్టుకు ఒక్కసారి కూడా పుష్కలంగా నీటి అందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కృష్ణా నీటిని ముచ్చుమర్రి పథకం నుంచి కేసీకి ఎత్తి పోయడం వల్ల 40 కి.మీ నుంచి 120 కి.మీ వరకు ఉన్న ఆయకట్టు రైతులకు మాత్రమే అందుతోంది. సుంకేసుల నుంచి వచ్చే నీరు, ముచ్చుమర్రి పథకం నుంచి వచ్చే నీటితో రెండు కార్ల ఆరు తడి పంటలను మాత్రమే పండించుకుంటున్నారు. ముచ్చుమర్రి పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటే రెండు కార్ల సోనా మసూరి వడ్లను పండించుకోవచ్ఛు