తెరాస అభ్యర్థులను గెలిపించాలి.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెరాస అభ్యర్థులను గెలిపించాలి..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మే 7  (way2newstv.com):
జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆయన జగిత్యాల మండలం వెల్దుర్తి లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని  తెలిపారు.  


తెరాస అభ్యర్థులను గెలిపించాలి..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో చేసే పనులల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందని తెలిపారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని ,ఆసరా పింఛన్ల పెంపు, కళ్యాణ లక్ష్మీ,షాది ముబారాక్ ద్వారా పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్ ,బీడీ కార్మికులకు పింఛన్లు ,ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తున్నమని తెలిపారు. వెల్దుర్తి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని,కుల వృత్తి దారుల సంక్షేమం,రైతు సంక్షేమం ,గురుకుల విద్యాలయాల ఏర్పాటు తో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తెరాస బలపరిచిన జగిత్యాల రూరల్ మండలం  జడ్పీటీసీ అభ్యర్థి దవా వసంత సురేష్ ,  వెల్దుర్తి ఎంపీటీసీ అభ్యర్థి బందెలా సునీత రాజశేఖర్ లను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుర్ర ప్రవీణ్,ప్రకాష్, అయిల్నేని ఆనందరావు,రాం కిషన్,మెన్నేని శ్రీనివాసరావు, రాజగోపాల్ రావు, తిరుపతి,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.