ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక

విజయవాడ, మే 4 (way2newstv.com)
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడగాల్పుల వీస్తాయని  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)హెచ్చరించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి . 


ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక

వృద్దులు, చిన్నపిల్లలు ఇల్లు వదిలి ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని ప్రకటనలో పేర్కోంది. అత్యధికంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్  ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం  వుంది.  ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల  ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.