ఉత్పత్తి పెరిగిన ధర తగ్గని గుడ్డు ధర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉత్పత్తి పెరిగిన ధర తగ్గని గుడ్డు ధర

నల్గొండ, మే 4, (way2newstv.com)
సాధారణంగా ఏ సరకైనా ఉత్పత్తి పెరిగితే, దాని ధరలు కొంతమేర తగ్గుముఖం పడుతాయి. కానీ రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి పెరిగినా... ధరలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో గుడ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సిండికేట్గా మారిధరలను విపరీతంగా పెంచేస్తోన్నారు. ఉత్పత్తిదారుల ధరలు ఒకలా ఉంటే, అది వినియోగ దారుల వద్దకు చేరేసరికి రెట్టింపు అవుతోంది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బాగానే ఉన్నాయని నెక్ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 80వరకు ఉన్న ఫౌల్రీ్ట ఫారాలు చికెన్తోపాటు కోడిగుడ్ల పైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. అయితే వేసవిలో చికెన్ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రోజుకూ కోటి గుడ్ల వరకూ వినియోగం జరుగుతోంది. 


ఉత్పత్తి పెరిగిన ధర తగ్గని గుడ్డు ధర

వేసవి సెలవులు కావడంతో అంగన్వాడీలు, హాస్టళ్లు మూసి ఉంచడంతో గుడ్ల సరఫరా నిలిచి పోయింది. ఈ పథకాల కోసం రోజుకూ 50లక్షల మేరకు గుడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుండేది. అయితే హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉంచడం వల్ల వాటి వినియోగం జరగడంలేదు. గుడ్లను సరఫరా చేసే పౌల్ట్రీ వ్యాపారులు బహిరంగ మార్కెట్కు వాటిని తరలిస్తున్నారు. అయినా కూడా నగరంలో గుడ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. వాస్తవంగా ఫామ్ ధర గుడ్డుకు 2.50 నుంచి రూ2.75 పైసలకు మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారు.తిరిగి వారు హోల్సేల్ వ్యాపారులకు రూ. 2.80 పైసల నుంచి రూ. 2.90 పైసలకు అమ్ముతున్నారు. హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు ఒక గుడ్డు రూ.3.25 పైసల నుంచి రూ3.50 పైసల వరకూ అమ్ముతున్నారు.ఇక రిటైల్ వ్యాపారులు వినియోగదారుల నుంచి ఒక గుడ్డుకు 5 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అంటే ఫామ్ వద్ద నుంచి వినియోగదారుడికి చేరుకూనే లోపూ గుడ్డు ధర దాదాపుగా రెండింతలు పెరుగుతోంది.  ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ తెలంగాణ దేశంలో నెంబర్వన్గా ఉంది. సాధారణ ప్రజలకు కోడిగుడ్డు ఇప్పటికీ ప్రియంగానే మారింది. గత రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగింది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటిన్నర గుడ్లు వినియోగం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎండలు మార్చి నుంచే మండిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో కొంత తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం జంటనగరాల్లో కోటి గుడ్ల మేరకు వినియోగం అవుతున్నట్టు ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సలహాదారు సుబ్బరాజు వెల్లడించారు.