సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతుండడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నేరేడ్ మెట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. వైఎస్సార్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
వైఎస్సార్సీపీ గెలుపుతో సంబరాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయంతో చంద్రబాబు అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పడిందని అన్నారు. జగన్ గెలుపుతో ఏపీ లో రాజన్న రాజ్యం రాబోతుందని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేసుకునే అవకాశము వచ్చిందని అన్నారు. వైఎస్సార్సీపీ కి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు వెంకట్ రావు, మహేష్, మహిళా కార్యదర్శి సుమతి మోహన్, నాయకులు వామనాచారి, బండా సుబ్బారాయుడు, లక్ష్మీ నారాయణరెడ్డి, రఘురాంరెడ్డి, వీనయ్య, మహేష్, శ్రీరామ మూర్తి, జోయెల్, భూమిందర్, అమర్ నాథ్, ఖాన్ ఉన్నారు.