నెల్లూరు, మే 1, (way2newstv.com)
జిల్లాలో విద్య, వైద్యం రెండూ రోడ్డున పడ్డాయి. జిల్లా అధికార యంత్రాంగం అదుపాజ్ఞలు తప్పి జనంపై స్వారీ చేస్తున్నా యి. ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి తప్పని సరిగా కల్పించాల్సిన ప్రధాన్యతాంశాల్లో విద్య, వైద్యం అత్యంత ముఖ్యమైనవి. విద్య ద్వారా అక్షరాస్యత పెరిగి మానవ వనరు లు వృద్ధి చెందుతాయి. వైద్యాన్ని అందుబా టులోకి తీసుకొస్తే ఆరోగ్యవంతమైన సమా జం నిర్మితమవుతుంది. ప్రభుత్వం ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేసిన ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా దోపిడీ వేళ్లూను కుంది. ఖంగు తినే హంగులతో నామ కర ణాలున్న ప్రయివేటు స్కూల్స్ యాజమా న్యాలు తల్లిదండ్రుల బలహీనతలే ఆసరా గా వారి జేబులు గుల్ల చేస్తున్నారు. మరో వైపు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు ఆసుపత్రులు కనీసం రోగుల నాడి అయినా పట్టకుండా ఎడాపెడా దోచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 151 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా అందులో 100కి పైచిలుకు ఆసుపత్రులు జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. చిన్నపాటి సమస్యతో వెళ్లినా స్కానింగ్‌లు, రక్త పరీక్షలు అంటూ హడావుడి చేసి స్కానింగ్ సెంటర్ల పర్సంటేజీలకు కక్కుర్తి పడుతున్నారు. ఆనక కనీసం రోగి నాడి పట్టి చూడకుండా రిపోర్టుల ఆధారంగానే కుప్పలు తెప్పలుగా మందులు రాసేస్తున్నారు.
రక్తపరీక్షల పేరుతో దోచేస్తున్నారు
ఇక అనుమతుల విషయానికొస్తే అధికార యంత్రాంగం కళ్లుగప్పి యదేశ్చగా దోపిడీ సాగించేస్తున్నారు. కేవలం సత్తుపల్లిలో డీఎంహెచ్‌వో జరిపిన ఆకస్మిక దాడుల్లోనే నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయంటే ఇక జిల్లా కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ప్రజా వైద్యశాల పేరులో సేవ ఉన్నా ఆ ఆసుపత్రికి అనుమతులే లేవు. బాలాజీ నర్సింగ్ హౌమ్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకుండానే సాగిపోతోంది. వీటిలో ఎక్కువగా నెల్లూరులోనే ఉన్నాయి. వీటిలో కొన్ని మినహా ఎక్కడా కూడా రక్తపరీక్షలకు సంబంధించిన పట్టికలు ఏర్పాటు చేయలేదు. కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, కోవూరు, వింజమూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో అధికంగా ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేటు వైద్యశాలలున్నాయి. అక్కడ వైద్యులు ఎంత చెబితే అంతే. వారు ఆస్పత్రికి వెళ్లిన రోగిని వివిధ రకాల రక్తపరీక్షలు చేయించుకురావాలంటూ సూచిస్తారు. ల్యాబొరేటరికి వెళ్తే వారు నిలువునా దోచుకుంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల అనధికారిక రక్త పరీక్షా కేంద్రాలు నడుస్తున్నాయి. అనుమతులు లేక పోయినా అధికారుల సహకారంతో ఆయా కేంద్రాలు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం నిర్వాహకులు ఆయా ల్యాబ్‌లలో ఆరు నెలలు మాత్రమే పని చేసి ఇతర ప్రాంతాల్లో ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసుకుంటారు. వీరికి ఏ అర్హతా ఉండదు. చాలా చోట్ల సహాయకులుగా చేరేవారే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లలో టెక్నీషియన్లకు సరైన అర్హత లేకపోయినా వైద్యులు వారి వద్దనే రక్తపరీక్షలు చేయిస్తూ ప్రజలను మోసం చేస్తుంటారు. సాధారణ రక్త పరీక్షలు చేయాలంటే డిఎంఎల్‌టి, డిఎస్‌బిఎంఎల్‌టి, ఎంఎస్‌డిఎల్‌టి పూర్తి చేయాలి. చాలా మందికి అర్హత లేకపోయినా ప్రైవేటు కేంద్రాల్లో పని చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో ఆయా పరీక్షలకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి సూచిక బోర్డులు ఎక్కడా కనిపించవు. అలాంటి ల్యాబ్‌లలో రక్తపరీక్షలు చేయించుకుని తప్పుడు ఫలితాలు రావడం వల్ల తమకేదో రోగం ఉందని కొందరు కుంగిపోతున్నారు. అదే మరో కేంద్రంలో పరీక్ష చేయించుకుంటే ఎలాంటి ఆనారోగ్యం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న సంఘటనలు కోకొల్లలు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వాటికి అనుబంధంగా ఉన్న ల్యాబొరేటరీల్లోనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. ఆ విధంగా రోగులను ఆర్థికంగా పీల్చి పిప్చి చేస్తారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేటు ఆరోగ్య కేంద్రానికి వెళ్తే రోగుల బలహీనతను సొమ్ము చేసుకుంటారు. ధనార్జనే ధ్యేయంగా ఆరోగ్య సమస్య లేకపోయినా లేని పోని అపోహలు తలెత్తెలా అన్ని రకాల రక్తపరీక్షలు చేయించి రోగుల జేబులు ఖాళీ చేయిస్తున్నారు. అందులో వైద్యులకు భారీగా పర్సంటేజీలు ఇస్తుంటారు. ఒక్కో రక్త పరీక్షకు వెయ్యి నుండి 1,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక వైద్యుడి వద్ద చేయించిన రక్త పరీక్షలను మరో డాక్టరు తిరస్కరిస్తారు. మళ్లీ చేయించుకోవాలని సూచిస్తారు. దీంతో రోగి ఆర్థికంగా చితికి పోతున్నాడు. జిల్లాలో ఈ ప్రైవేటు ల్యాబొరేటరీలను అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 600 లకు పైగా ఈ రక్త పరీక్షా కేంద్రాలున్నాయి. ఎటువంటి అనుమతి లేని ఈ రక్తపరీక్షా కేంద్రాలను తనిఖీలు చేయకపోవడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పేదలను నిలువునా దోచుకుంటున్నారు.