తండ్రి ఫార్ములాలోనే జగన్


కడప, మే 27  (way2newstv.com)
వైఎస్ రాజశేఖర రెడ్డికి వున్న అలవాట్లలో చాలా ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్ కు వున్నాయి. వై.ఎస్ ఉదయం 4 గంటలకు లేచి వ్యాయామం, యోగా చేసేవారు. ఆ తరువాత మితంగా ఆహరం తీసుకునే అలవాటు. వైఎస్ జగన్ కూడా ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు వ్యాయాయం అయ్యాక పళ్ళ రసాలు తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ అప్పుడప్పుడే. వీలైనంత జ్యుస్ లతోనే సరిపెట్టుకుంటారు. ఆ తరువాత పత్రికలను చదువుతారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో ఉదయం 9 గంటలనుంచి మునిగి తేలుతారు. 


తండ్రి ఫార్ములాలోనే జగన్
రాత్రి 10 గంటలలోపు తన కార్యకలాపాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తారు.ఆదివారం పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తారు జగన్. అత్యవసరం అనుకుంటే తప్ప పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వరు. ఆ రోజు ఎవరిని కలుసుకోవటానికి సాధారణంగా ఇష్టపడరు. వారంలో మిగిలిన అన్ని రోజులు పార్టీ కోసం పూర్తిగా కేటాయిస్తారు. గతంలో వైఎస్ అయితే ఉదయాన్నే తన వ్యాయమ కార్యక్రమాలు పూర్తి అయ్యాకా ముఖ్యమంత్రి హోదాలో వున్నప్పుడు ముఖ్యమైన వారితో ఫోన్లో మాట్లాడటం వంటివి చేస్తారు. పత్రికలను చదవడం ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను, కలిసేవారు. జిల్లా పర్యటనల్లో ఉదయం పూట ప్రజలనుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వారు పేర్కొన్న సమస్యలు వాస్తవం అయితే రాత్రికల్లా చర్యలు తీసుకునేలా ఒక బృందాన్ని ప్రత్యేకంగా కొనసాగించేవారు. ఇప్పుడు జగన్ తన తండ్రి ఫార్ములా లోనే నేరుగా వెళతారా లేక మరింత భిన్నమైన మార్గంలో తండ్రిని మించిన కొడుకు అవుతారా అన్నది వేచి చూడాలి
Previous Post Next Post