యోగికి తాకిన చంద్రబాబు సెగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యోగికి తాకిన చంద్రబాబు సెగ

లక్నో, మే 2, (way2newstv.com)
ఏపీలో సీఎం చంద్రబాబును ఎన్నికల కోడ్ పేరుతో ఈసీ వేధిస్తోందని.. మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్న ఈసీ అధికారులు ఏపీ సీఈవో చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే... ఇదే సమయంలో బీజేపీకి చెందిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈసీ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం గుర్తించాలి. మరీ ముఖ్యంగా యోగిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నది ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంఘం సీఈవో. ఆయనెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పేరు లక్కు వెంకటేశ్వర్లు. సీనియర్ ఐఏఎస్ అధికారి.తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో ముందుండే యోగి ఎన్నికల సమయంలో తన నాలుకకు మరింత పదును పెడతారన్న సంగతి తెలిసిందే. 


యోగికి తాకిన చంద్రబాబు సెగ

అయితే.. యోగి ఎక్కడ మాట తూలినా సీఈవో మాత్రం ఎక్కడికక్కడ నిలువరిస్తూ వస్తున్నారు. భారత సైన్యాన్ని మోదీ సేన అని యోగి అనడంపైనా సీఈవో నివేదికలు తెప్పించుకుని సీఈసీకి పంపారు. అంతేకాదు... ఆలీ, బజరంగ భళి మధ్య పోరు అన్న యోగి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై ఏకంగా 72 గంటల ప్రచార నిషేధం విధించారు లక్కు వెంకటేశ్వర్లు.నిషేధం ముగిసిన తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి మరోసారి తన నోటికి పనిచెప్పారు. దానిపై సీఈవో నివేదికలు తెప్పించకున్నారు. సంభాల్ జిల్లలో ప్రచారానికి వెళ్లిన యోగి అక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థిని బాబర్ వంశానికి చెందినవాడంటూ ఎగతాళిగా వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ ఫిర్యాద చేసింది. దానిపై సీఈవో వెంకటేశ్వర్లు స్పందించి అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. మొత్తానికి తెలుగు ఐఏఎస్ ఒకరు బీజేపీ ఫైర్ బ్రాండ్ సీఎంను ఎలక్షన్ కోడ్‌ను ఆయుధంగా మలచుకుని వెంటాడడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోందిప్రకాశం జిల్లాకు చెందిన లక్కు వెంకటేశ్వర్లుకు చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయన్నది టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. ఏపీలో తనను ఈసీ ద్వారా కేంద్రం అల్లరి చేస్తోందని భావిస్తున్న చంద్రబాబు బీజేపీకి చెందిన సీఎంను యూపీలో తెలుగు ఐఏఎస్‌ను అడ్డంపెట్టుకుని ఉరుకులు పెట్టిస్తున్నారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది.యోగి ఆదిత్యనాథ్‌తో చంద్రబాబుకు ఎలాంటి విభేదాలు, మాటల యుద్ధం లేనప్పటికీ.. యూపీలో యోగియే స్టార్ క్యాంపెయినర్ కావడంతో ఆయన్ను కట్టడి చేస్తే బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న ఉద్దేశంతో చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ వర్గాలూ అనుమానిస్తున్నాయట.