ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకెళుతున్నారు. తాజగా రైతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్. గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేసిన జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటున్నారు. రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర అందేలా.. చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెట్టడంతో పాటూ రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రద్దు చేశారు. అలాగే నకిలీ విత్తనాల వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్టోబరు 15 నుంచి రైతు భరోసా
నకిలీ విత్తన వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని.. అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు వెనకాడొద్దని అధికారులకు సూచించారు. విత్తన చట్టం తెచ్చే అంశంపై అధికారులతో చర్చించిన జగన్.. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ చేయడంతో పాటూ.. వ్యవసాయం, రైతులకు మేలు చేసే విధంగా మంచి సలహాలు ఇచ్చే అధికారులు, సిబ్బందికి సన్మానం చేస్తామన్నారు. రైతులకు బీమా సౌకర్యంపైనా అధికారులతో చర్చించారు.నకిలీ విత్తన సంస్థలపై చర్యలు ఆంధ్రప్రదేశ్ లో రైతులను నిండా ముంచేస్తున్న నకిలీ విత్తనాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై సమీక్ష నిర్వహించారునకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలనీ, అవసరమైతే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్తగా విత్తన చట్టం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే ఈ విషయమై శాసనసభలో చర్చించి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపిణీ జరగాలని అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చే సిబ్బందికి సన్మానం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రైతులకు బీమా సౌకర్యాన్ని సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ బీమాకు సంబంధించి ప్రీమియంను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు
Tags:
Andrapradeshnews