అసెంబ్లీలో నల్లరిబ్బన్స్ తో ఆందోళన
హైద్రాబాద్, జూన్ 6, (way2newstv.com)
సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ భగ్గుమంటోంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీలు నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయమని అడగడం దారుణమని.. విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాము పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు మాత్రం విలీన ప్రక్రియకు హడావిడిగా ప్రయత్నాలు చేశారన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పీకర్ పోచారం ఛాంబర్‌కు ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు ఉత్తమ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని.. ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
సభాపతిపై కాంగ్రెస్ ఫైర్
తాము సభాపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉందని.. అలాంటప్పుడు విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదేమి న్యాయం ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ విలీనం కోరుతూ టీ-కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తో మాట్లాడే నిమిత్తం ఆయన కార్యాలయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. పోచారం అందుబాటులో లేరన్న సిబ్బంది సమాచారంతో ఉత్తమ్ అసంతృప్తికి గురైనట్టు, స్పీకర్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ రహస్యంగా ఎందుకు కలిశారు? స్పీకర్ ను కలిసేందుకు తమకు ఎందుకు సమయమివ్వడం లేదు? అంటూ ఉత్తమ్ నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా, సీఎల్పీ విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అరెస్ట్ సీఎల్పీ విలీనం కోరుతూ టీ-కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీనిని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు కొనసాగించారు. సీఎల్పీని విలీనం చేయాలని కోరడం అప్రజాస్వామికమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. అసెంబ్లీ ముందు, రోడ్డుపై బైఠాయించిన వీహెచ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.