పోయిన చోటే వెతుక్కునే పనిలో పడింది జనసేన పార్టీ. మొన్నటి ఎన్నికల్లో అధ్యక్షుడితో సహా ఒక్కరు తప్ప అంతా ఘోరా పరాజయం పాలయ్యారు. దాంతో భవిష్యత్తు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి అంటే ఖచ్చితంగా పటిష్ట పార్టీ నిర్మాణం జరిగి తీరాలి. అందుకోసం ఐదేళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. జనసేన వైఫల్యంలో లోపం ఎక్కడ ఉందొ గుర్తించిన అధినేత పవన్ కళ్యాణ్ సరిగ్గా ఈ పాయింట్ పైనే సీరియస్ గా ఫోకస్ పెట్టారు. నిత్యం ప్రజల్లో ఉండటం, సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయడం పై ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు.వాస్తవానికి 2009 నుంచి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయం లో మాత్రమే చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆ తరువాత ఆయన సినీ ఇండస్ట్రీ కె పరిమితం అవుతూ వచ్చారు.
జనసేనాని సీరియస్ పాలిటిక్స్
దీనివల్ల ఆయనను ఇంతకాలం సీరియస్ పొలిటీషియన్ గా జనం గుర్తించలేదు. 2014 లో కూడా జనసేన పార్టీ ని ప్రకటించినా ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపికి, బిజెపికి మద్దత్తు పలికారు పవన్. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాకా ఐదేళ్ళు ప్రజల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించడం కానీ అధికార పక్షాల వైఫల్యాలను ఎత్తిచూపకుండా ఎక్కువగా విపక్షంపై యుద్ధం చేస్తూ వచ్చారు. దాంతో ఆయన టిడిపికి రహస్య మిత్రుడిగా జనం భావించి చంద్రబాబు కి వైఎస్ జగన్ మాత్రమే చెక్ చెప్పగలరని నమ్మి ఫ్యాన్ గుర్తుకే జై కొట్టారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతా అన్న పవన్ కమ్యూనిస్ట్ లు బీఎస్పీ తో పొత్తుపెట్టుకుని రావడంతో ఆయనకు బలం లేకే ఈ హడావిడి అన్నది ప్రచారం బాగా జరగడంతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ అయ్యింది. తాను పొత్తు లేకుండా దిగుతా అనడమే కాకుండా గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం అన్న పవన్ కళ్యాణ్ టిడిపి సర్కార్ ఏర్పడ్డాకా అప్పుడప్పుడు పెట్టిన బహిరంగ సభల్లో వన్ మ్యాన్ షో ఇస్తూ ఫ్యాన్స్ మాత్రమే తన క్యాడర్ అని లెక్కసి క్షేత్ర స్థాయి ని పూర్తిగా విస్మరించారు. ఫలితం అందరికి తెలిసిందే .సరైన క్యాడర్ లేకుండా గత ఐదేళ్ళుగా తూటాల్లాంటి మాటలతో అలరిస్తున్న పవన్ కళ్యాణ్ జరిగిన తప్పు తెలుసుకున్నారు. వైసిపికి ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే అని టిడిపికి ఇక చరిత్ర సమాప్తమనే స్లోగన్ అందుకున్నారు. మరి పవన్ ఇప్పుడు ఏ మేరకు పార్టీని పటిష్టం చేస్తారు ? శక్తివంతమైన జగన్ సర్కార్ తో ఆయన పోరాటాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇంటర్వెల్ తరువాత చూడబోతున్నాం.