ముందుకు సాగని మైక్రో ఇరిగేషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముందుకు సాగని మైక్రో ఇరిగేషన్


విజయనగరం, జూన్ 26, (way2newstv.com
సూక్ష్మ సేద్యాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో బిందుసేద్యం పథకానికి రాయితీలు విరివిగా అందజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు 100 శాతం, ఇతర వర్గాలకు 90 శాతం రాయితీ అమలు చేస్తున్నారు. ఒక రైతుకు రూ.2 లక్షల వరకు పరిమితి విధించారు. హెక్టారుకు రూ.50వేలు ఖర్చయితే ఇందులో 10శాతం రైతు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90శాతం ప్రభుత్వం భరిస్తోంది. అయితే జిల్లాలో ఐదు కంపెనీలకు ఈ బాధ్యతలను అప్పగించారు. అర్హులైన రైతులు తమ వాటాధనం చెల్లించిన వెంటనే ఏజెన్సీలు వీటిని అమర్చాలి. పొలంలో అమర్చాక  తమ పని అయిపోయిందని ఏజెన్సీలు చేతులు దులుపుకొంటున్నాయి. అప్పుడే రైతుల వద్ద నుంచి కాగితాలపై సంతకాలను చేయించేస్తున్నారు. అనంతరం ఆయా మొత్తాలు ఏజెన్సీల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి.. అనంతరం ఏ మరమ్మతులు వచ్చినాఅమర్చిన ఏజెన్సీలు మూడేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా బాధ్యత వహించాల్సి ఉంది. కానీ రైతుల వైపు చూస్తున్న సందర్భాలు లేవు.  జిల్లాలో 2003 నుంచి ఈపథకం ప్రారంభమైంది. ఇంతవరకు 22,900 హెక్టార్ల భూములకు డ్రిప్‌ సౌకర్యం ఉన్నట్లు చెబుతున్నారు. 

ముందుకు సాగని మైక్రో ఇరిగేషన్

రానున్న మూడేళ్లలో ఏడువేల హెక్టార్లలో అమర్చాలని ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంత వరకు 170 హెక్టార్లలో డ్రిప్‌ పూర్తి చేయాలని తాత్కాలిక లక్ష్యాలు వేసుకున్నారు. కేవలం సాంకేతిక అనుమతులతోనే సరిపెట్టారు. డ్రిప్‌కోసం దరఖాస్తు  చేసుకున్న రైతులు 2,194 మంది ఉన్నారు. ఇందులో 1603 మంది రైతుల దరఖాస్తులను పరిశీలించినట్లు చెబుతున్నారు. కానీ ఇక్కడ జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా లక్ష్యాలు ముందుకు వెళ్లడం లేదు. పైగా బిందుసేద్యం పరికరాలు వినియోగంలో రైతులకు కొంత అవగాహన లేకపోవడంతో వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఉద్యాన, బిందుసేద్యం అధికారులు సదస్సులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.ఇంతవరకు 22,900 హెక్టార్ల భూములకు డ్రిప్‌ సౌకర్యం ఉన్నట్లు చెబుతున్నారు. రానున్న మూడేళ్లలో ఏడువేల హెక్టార్లలో అమర్చాలని ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంత వరకు 170 హెక్టార్లలో డ్రిప్‌ పూర్తి చేయాలని తాత్కాలిక లక్ష్యాలు వేసుకున్నారు. కేవలం సాంకేతిక అనుమతులతోనే సరిపెట్టారు. డ్రిప్‌కోసం దరఖాస్తు  చేసుకున్న రైతులు 2,194 మంది ఉన్నారు. ఇందులో 1603 మంది రైతుల దరఖాస్తులను పరిశీలించినట్లు చెబుతున్నారు. కానీ ఇక్కడ జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా లక్ష్యాలు ముందుకు వెళ్లడం లేదు. పైగా బిందుసేద్యం పరికరాలు వినియోగంలో రైతులకు కొంత అవగాహన లేకపోవడంతో వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఉద్యాన, బిందుసేద్యం అధికారులు సదస్సులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. పట్టించుకున్న పరిస్థితులు లేవు. స్ప్రింకర్లు, సంపులు మొరాయించి రైతులు  ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎవరూ రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తాలు చెల్లించి నెలలు అవుతున్నా....అమర్చని పరిస్థితులు ఉన్నాయి. మరికొంతమంది డ్రిప్‌కు దరఖాస్తు చేసుకుని నెలలు అవుతున్నా... వచ్చి పరిశీలించిన సందర్భాలు లేవు. ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అదీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు. డ్రిప్‌ అమర్చిన ఏజెన్సీలు మూడేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా బాధ్యత వహించాల్సి ఉంది. కానీ రైతుల వైపు చూస్తున్న సందర్భాలు లేవు.