రానా దగ్గబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి పాల్గొన్నారు. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
రానా దగ్గుబాటి, సాయిపల్లవి `విరాటపర్వం` ప్రారంభం
వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకాలపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, రానా దగ్గబాటి, డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, సాయిపల్లవి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, డైరెక్టర్స్ చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి తదితరులు