మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నాలుగవ రోజు శాసనసభకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో ఆర్కే, లోకేష్ ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు.
ఆర్కేకు కంగ్రాట్స్ చెప్పిన లోకేష్
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్కేకు.. లోకేష్ కరచాలనం చేసి కంగ్రాట్స్ తెలిపారు. ఇందుకు స్పందించిన ఆర్కే.. ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వీరిద్దరూ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి లోకేశ్ పై 5,200 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్ది ఆర్కే గెలుపొందారు.