క్రీడాకారులకు స్పోర్ట్స్ షూ పంపిణీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రీడాకారులకు స్పోర్ట్స్ షూ పంపిణీ


ఎమ్మిగనూరు జూన్ 6, (way2newstv.com)
 ఫుట్ బాల్ జాతీయస్థాయి క్రీడాకారులకు ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ షూలను పంపిణీ చేశారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో జాతీయస్థాయి ఫుట్ బాల్ క్రీడాకారులకు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఫర్టిలైజర్స్ ఉద్యోగులు సత్యారెడ్డి, బద్రి, ప్రదీప్, రాఘవరెడ్డి, రాజన్న, రాజశేఖర్, భాస్కర్, శేఖర్ లు కలసి రూ.10 వేలు విలువచేసే 16 జతల బూట్లను క్రీడాకారులకు ఉచితంగా అందజేశారు. 


క్రీడాకారులకు స్పోర్ట్స్ షూ పంపిణీ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడాకారులు ఎవరికైనా అవసరమైతే ఆర్థిక సాయం, దుస్తులు, షూ తదితర క్రీడా పరికరాలను అందిస్తామని తెలిపారు. ఆర్థిక సమస్యలతో క్రీడాకారులు వెనుకబడిపోకూడదనే భావనతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, వైఎఫ్ఏ సీనియర్ క్రీడాకారుడు విశ్వనాథ్ రమేష్ లు మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి మంచి పేరు ప్రతిష్ఠ తేవాలని కోరారు. కార్యక్రమంలో పియిటీలు నరసింహారాజు, వెంకటేష్, చంద్రమోహన్, శ్రీనివాసులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.