అనిల్ కు మంత్రి పదవి వస్తుందా ? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనిల్ కు మంత్రి పదవి వస్తుందా ?


నెల్లూరు జూన్ 6, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని వదలి వైసిపి కి జై కోట్టిన బిసిలు జగన్ మంత్రి వర్గంలో చోటును బలంగ ఆశిస్తున్నారు.నెల్లూరు జిల్లా నుండి ఏకైక బిసిల ప్రతినిధిగ ఉన్న నెల్లూరు సిటి ఎమ్మ్యేల్ల్యే అనిల్ కూమార్ యాదవ్ కు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన మోహన్ రెడ్డి కి విజ్ఞప్తులు చేస్తున్నారు.  రెడ్ల జిల్లాగ ఉన్న నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది..జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల కూడ కానీ గ్రేట్ రికార్డ్ ను జగన్ క్రియేట్ చేశారు. పది కి పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్దానల్లో ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది.. ఇది కేవలం రెడ్ల వల్లనే కాదు బిసి కులాలన్ని జగన్ కు ఒక్క ఆవకాశం అని క్యూ కట్టి ఓట్లేయడంతో వైసిపి కి చరిత్రలో దక్కని రికార్డ్ మెజారిటీ దక్కిందని బిసి కులాల లీడర్లు గుర్తు చేస్తున్నారు. 


అనిల్ కు మంత్రి పదవి వస్తుందా ?
నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ లో ఎంత మంది రెడ్డి లీడర్లు ఉన్న బీద బ్రదర్స్ కు చంద్రబాబు దగ్గర స్పెషల్ ప్లేస్ ఉంటుంది. రెడ్ల జిల్లాలో బీద సోదరులను చంద్రబాబు ప్రోత్సాహించినంత ఏ లీడర్ గతంలో ప్రోత్సాహించ లేదు. బీద మస్తాన్ రావు, రవిచంద్ర లు కూడ కష్ట,నష్టలు పడుతూ కూడ టిడిపి కోసం పని చేస్తున్నారు. వైసిపి కూడ భవిష్యత్ లో కేవలం రెడ్లను నమ్ముకోకుండ బిసిల అండ నెల్లూరు లో దక్కించుకోవల్సి ఉంది. టిడిపి లో బీద సోదరుల చరిష్మ, ప్రాధాన్యత కు తగ్గట్టుగ వైసిపి లో ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన లీడర్ బిసి ల మనసు గెలిచిన నాయకుడు  అనిల్ కూమార్ యాదవ్ నే కనిపిస్తాడు. జగన్ రెడ్డి కి నమ్మకంగా ఉండటం, జగన్ పై ఈగ వాలినా విమర్శలతో చెలరేగిపోయో ఆవేశం, వైసిపి లో కీలక లీడర్ గా అనిల్ కు ముద్ర ఉంది. ఈ క్రమంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో అనిల్ కూమార్ కు చోటు కల్పిస్తే వైసిపి పై బలహీన వర్గాలలో మరింత నమ్మకం పెరుగుతుందని బిసి సంఘాలు ఆశిస్తున్నాయి. అపర కోటీశ్వరుడైన మంత్రి నారాయణ పై గెలుపు కోసం అనిల్ పడ్డ శ్రమకు గుర్తింపు కూడ దక్కుతుందని బిసి కులాలు భావిస్తున్నాయి.