అధికారుల ఆలస్యంపై ఆగ్రహించిన జాయింట్ కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అధికారుల ఆలస్యంపై ఆగ్రహించిన జాయింట్ కలెక్టర్


ఏలూరు, జూన్ 10 (way2newstv.com):
చిత్తశుద్దితో ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన అధికారులలో కొంతమంది మీకోసం కార్యక్రమానికి ఆలస్యంగా రావడం , మరికొంతమంది అస్సలు రాకపోవడం చాలా విచారకరమని జిల్లా జాయింట్ కలెక్టర్  యం వేణుగోపాల్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం కార్యక్రమం సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు, పిర్యాదులను జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్ది స్వీకరించారు. ఈసందర్భంగా ఉదయం 10.30 గంటలు దాటినప్పటికీ చాలమంది అధికారులు మీకోసం కార్యక్రమానికి రాకపోవడం గమనించారు. శాఖల వారీగా పిలిచి అధికారుల హాజరును పరిశీలించారు. హాజరుతీసుకునే సమయానికి హాజరుకాని అధికారులను షోకాజ్ నోటీసులు జారీచేయడం జరుగుతుందన్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యేకదృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అధికారులు నిర్లష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఎంతోదూరం నుండి పేదప్రజలు సొమ్ములు లేనప్పటికీ అప్పులుచేసి, సమయం వెచ్చించి తమసమస్యలు పరిష్కరించుకునేందుకు మీకోసం కార్యక్రమానికి వస్తారని, కాని స్థానికంగా ఉండే అధికారులు మాత్రం సకాలంలో కార్యక్రమానికి హాజరుకాకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రజాసమస్యలపట్ల అధికారులు చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుండి వచ్చిన సమస్యలను స్వయంగా విచారణచేసి పరిష్కరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్  ఆదేశించారు.


అధికారుల ఆలస్యంపై ఆగ్రహించిన జాయింట్ కలెక్టర్

నిడదవోలు మండలం కంశాలపాలెం గ్రామానికి చెందిన  సింహాద్రి సత్యవతి వినతిపత్రం సమర్పిస్తూ ఉనకరమిల్లి గ్రామంలో తనకు వున్న 90 సెంట్లభూమిలో 20 సెంట్లు ఇందిరాసాగర్ ప్రాజెక్టుకుడి ప్రధాన కాలువ నిమిత్తం ప్రభుత్వం వారు తీసుకున్నారని మిగిలిన 70 సెంట్ల భూమిని కోయి సత్యం, సిద్దా గోవిందమ్మ అనే వ్యక్తులు దురాక్రమణకు పాల్పడుతున్నారని, తనభూమి సర్వేచేసి తనకు అప్పగించాలని కోరారు. పోలవరం మండలం గోపవరం గ్రామానికి చెందిన చాపర్ల రత్నకుమారి, నక్కా సోమ్య,, పులపల్లి గనియ్య మరికొంతమంది రైతులు పిర్యాదుచేస్తూ, సర్వే నెం 151,153,154,155,157 ఇంకా మరికొన్ని సర్వే నెంబర్లుగల తమ భూములకు ఆనుకుని వున్న ప్రభుత్వ పుంతరోడ్దును కొత్తపట్టిసం వాస్తవ్వులు చాలకుర్తి కిట్టయ్య అనే వ్యక్తి ఆక్రమించి తమను తమభూముల్లోకి వెళ్లకుండా అడ్దుకుంటున్నారని, దానివల్ల పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లేదారిలేదన్నారు. అడుతున్న తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారని జాయింట్ కలెక్టర్ శ్రీ యం వేణుగోపాల్ రెడ్ది దృష్టికి తీసుకువచ్చారు.నిడమర్రు మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఓరిరాల మహేష్‌బాబు వినతిపత్రం సమర్పిస్తూ నిడమర్రు మండలం ఆముదాలపల్లి రెవెన్యూ పరిధిలోగల సర్వే నెం .111 లో గల మా భూధాన భూమి యం .4.55 సెంట్లను అగ్రకులానికి చెందిన ముదునూరి గోపాలకృష్ణరాజు,ముదునూరి దివ్వ అనేవారు కబ్జాచేశారని, రెవెన్యూ అదికారులు కబ్జాచేసిన వారికే సదరుభూమికి పట్టాధార్ పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ ఇచ్చారని పిర్యాదుచేశారు. విచారణచేసి తమభూమి తమకు అప్పగించాలని కోరారు.నిడదవోలు 25వ వార్దు లో గత రెండు సంవత్సరాలనుండి త్రాగునీరు వృధాగాపోతోందని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ పట్టించుకోవడంలేదని గనసాల కృష్ణ అనేవ్యక్తి పిర్యాదుచేశారు.ఏలూరు మండలం చాటపర్రు ఎస్‌సి గ్రామప్రజలు బి.వినోద్ కుమార్ మరికొంతమంది వినతిపత్రం సమర్పిస్తూ కొల్లేరు ఆపరేషన్ (2006 )లో చాటపర్రు ఎస్‌సి 3 సొసైటీలు ధ్వంశం చేయడం జరిగిందని, కాని మాకు ఎటువంటి నష్టపరిహారంగాని, భూమిగాని ఇవ్వలేదని చెప్పారు. అంతేగాక మాధవాపురం చెక్‌పోస్ట్ వెనుకఉన్న ఎస్‌సి గ్రామానికి చెందిన సుమారు య .48.00 సెంట్లుభూమి కూడా ధ్వంసం చేశారని, తాతముత్తాతల నుండి ఆభూములపై ఆధారపడి జీవిస్తున్నామని, కావున సదరుభూములు సర్వేచేయించి ఇప్పించాలని వేడుకున్నారు.ఆకివీడు మండలం ఆకివీడు గ్రామానికి చెందినవ కడితల రత్న వినతిపత్రం సమర్పిస్తూ, ధర్మాపురం అగ్రహారం గ్రామం తాలూకు మా వ్యవసాయ భూములకు సరిహద్దుంలో మద్దా నాగరాజు, మద్దా రామారావు, మద్దా నాగేశ్వరరావు అనే వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా చేపలచెరువులు త్రవ్యారని దానివల్ల పంటపొలాలకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎన్ .సత్యనారాయణ, డిసిహెచ్ఎస్ డా.శంకరరావు, డియం అండ్ హెచ్ఒ డా.సుబ్రహ్మణ్యశ్వరి, ఐసిడిఎస్ పిడి విజయకుమారి, హౌసింగ్ పిడి 
శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ జేడి గౌషియా బేగం, డిఇఒ సివి రేణుక, మత్స్యశాఖ జేడి డా.అంజలి, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, ఎల్‌డియం  సూర్యారావు, ఇతరశాఖ అధికారులు పాల్గొన్నారు.