ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రారంభమైన ఆర్ఆర్ఆర్


హైద్రాబాద్, జూన్ 6 (way2newstv.com)
ఏడు వరాల బ్రేక్ తర్వాత #ఆర్ ఆర్ ఆర్ టీం మళ్ళీ షూటింగ్ చిత్రీకరణలో బిజీ అయ్యింది. రాజమౌళి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్ మధ్యలో చేతికి గాయమైన ఎన్టీఆర్ ఇప్పుడు గాయం మానిన తర్వాత #ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గత రెండు రోజులుగా రాజమౌళి కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ పై #ఆర్ ఆర్ ఆర్ లో కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. 


ప్రారంభమైన ఆర్ఆర్ఆర్
హైదరాబాద్ లోని ప్రత్యేకమైన సెట్ లో కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలును చిత్రీకరిస్తున్నారని సమాచారం.అయితే ఈ బ్రిటిష్ యుద్ధ సన్నివేశాలు #ఆర్ ఆర్ ఆర్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తాయట. సినిమాలో ఈ కీలక సన్నివేశాలు బ్రిటిష్ సైనికులు భారతీయుల పై చేసే దాడులకి ప్రతీకారంగా ఎన్టీఆర్ వారిని అంతం చేసే క్రమంలో వస్తాయని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ గాయం మాని షూటింగ్ లో పాల్గొంటుంటే… రామ్ చరణ్ భార్య ఉపాసనతో విదేశీ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో రామ్ చరణ్ కూడా #ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడట