అల్లదిగో... నవకాంతుల కాళేశ్వరం ! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అల్లదిగో... నవకాంతుల కాళేశ్వరం !


21న ప్రారంభోత్సవానికి మెగాప్రాజెక్టు ముస్తాబు
హైదరాబాద్ జూన్ 18  (way2newstv.com)
ఔను… అతడొక అసాధ్యుడు.. ఎవరికీ తట్టని ఆలోచనకు ప్రాణం పోసి.. అది రూపం వచ్చేవరకు వెంటపడి.. పరుగులెత్తించి గోదారి గంగ కదలివచ్చేలా చేసిన మహానేత. అందరూ సాధ్యం కాదనుకున్న.. అద్భుతాలను సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏటికి ఎదురీది నిలిచి గెలవడం ఆయన లక్షణం. రాదనుకున్న తెలంగాణను ఉద్యమదివిటీతో సాధించినట్లే.. ఇపుడు ఓ మహాద్భుత ప్రాజెక్టును అందరూ చూస్తుండగానే కళ్లముందు నిర్మించి నిలిపి గెలిచిన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దేశచరిత్రలోనే అత్యంత వేగంగా పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రకెక్కడం వెనుక, దేశానికే ఒక మహానమూనాగా నిలవడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కఠోరశ్రమ, అపారమేధస్సు కనబడుతాయి. ఇంజనీర్లలో ఇంజనీర్లా, పాలకుడిగా, ఆర్థిక నిపుణుడిగా, ఉద్యమకారుడిగా, నీళ్ళకోసం తపన పడే రైతుగా.. పట్టుబట్టి, పంతంబట్టి కాళేశ్వరాన్ని చరిత్రలో నిలపడమే కాదు.. ఒక చరిత్రగా నిలిపిన మహా నాయకుడు కేసీఆర్. 


అల్లదిగో... నవకాంతుల కాళేశ్వరం !

ఈజిప్ట్కు పిరమిడ్, చైనాకు త్రీగోర్జెస్ డ్యాం, ఇండియాకు తాజ్మహల్లా తెలంగాణకు కాళేశ్వరం ఓ అద్భుతం. ప్రపంచం అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ ప్రాజెక్టును నిలపడంలో కేసీఆర్ పరిశ్రమ పాలకులకు స్ఫూర్తిదాయకం.సర్జ్పూల్ సంభ్రమం  ఊహకందని నిర్మాణాన్ని సృష్టించడానికి కేసీఆర్ ఏం చేశారు? 150మీటర్ల లోతు… 375మీటర్ల పొడవు, 67 మీటర్ల ఎత్తు, 25 మీట ర్ల వెడల్పు అండర్ గ్రౌండ్ టన్నెల్ సర్జ్పూల్. ఇదొక్కటి చాలు కాళెశ్వరం ఎలాంటి మహా నిర్మాణమో చెప్పడానికి. భూగర్భంలో జలా ద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు.. చెబుతుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ నిర్మాణంలో గొప్పదనాన్ని కేవలం పదాల్లో వర్ణించి చెప్పలేం.  ఆసియాలోనే అనేక ప్రత్యేకతల సమాహారంగా కాళేశ్వరం ప్రాజెక్టును చెక్కిన రూపశిల్పి, మేరు నగధీరుడు కేసీఆర్.కళ్ళముందు కలల ప్రాజెక్టు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ టేబుల్ ముందు పెద్దస్క్రీన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ బ్యారేజీ దగ్గర ఏపనులు జరు గుతున్నాయి.. ఎంత కాంక్రీట్ వేశారు? ఏ పంప్హౌజ్లో ఏ పనులు జరుగుతున్నాయి? అంతా కళ్ళముందు కదలాడుతుంది. కాళేశ్వరం బ్యారేజీల పనులు, పంపుహౌజ్ల పనులు అక్కడ ప్రత్య క్షంగా కనబడుతుంటాయి. ఎక్కడ, ఎంత పని జరుగుతోం ది.. ఏం జరుగుతోంది.. ఎవరు పనిచేస్తున్నారు? అంతా కళ్ళ ముందు తెరపై కనిపిస్తూంటుంది. ఈ ప్రాజెక్టు పని జరు గుతున్న తీరు, ప్రగతిని స్వయంగా రోజూ పరిశీలించడం కేసీఆర్ విధుల్లో ఒకటి. ఏ ప్యాకేజీ ప్రోగ్రెస్ ఏంటి.. ఎపుడు ఫలితాలొస్తున్నాయ్.. ఎదురవుతున్న ఇబ్బందులేంటి? పరిష్కారాలేంటి? సంబంధిత అధికారులతో చర్చించారు. అనుమతుల విషయంలో సిీఎం గంటగంటకూ పరిస్థితి తెలుసుకుంటూ.. సలహాలిస్తూ పరుగెత్తించిన ఫలితంగానే భారతదేశంలోనే తొలిసారి ఒక్క ఏడాదిలోనే 215 రకాల అనుమ తులు కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించాయి.