గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే


నాగర్ కర్నూలు జూన్ 18  (way2newstv.com)
నాగర్ కర్నూల్ జిల్లా. కొల్లాపూర్ మండలంరామాపురం లో జరిగిన గొర్రెలు, మేకలలో వచ్చే నట్టల వ్యాధి నివారణ కు గాను ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గోన్నారు.  ఈ కార్యక్రమానికి పశువైద్య శాఖ అధికారులు, పెద్దఎత్తున గొర్ల కాపరులు హజరయ్యారు. 


గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే 
ఎమ్మెల్యే  మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర   గొర్ల కాపరులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ను చేపట్టింది, ఈ పతాకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, గతంలో మంజూరు అయిన యూనిట్ లను లబ్దిదారులకు మధ్యవర్తులు కలిసి అమ్ముకున్నారు, రాబోయే రోజుల్లో మంజూరు చేసే యూనిట్ లను అమ్ముకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,  ఈ కార్యక్రమం లో ఆయన వెంట తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post