ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ లు


అమరావతి జూన్ 18  (way2newstv.com)
పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలనే సీయం నిర్ణయంపై చర్చలు జరిపాం.  మొత్తం 19 మోడల్స్ ని ఎంపిక చేశాం.. యూనిట్ ఆఫీసర్స్ ఏదోక మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.  ప్రతి యూనిట్ నుండి  ఫీడ్ బ్యాక్ తీసుకొని కొన్ని రోజులకి మార్పులు చేర్పులు చేస్తామని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్  వెల్లడించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.  70 వేల పోలీసులకి  ఐటీ ప్లాట్ తయారు చేసి పారదర్శకంగా డాష్ బోర్డ్ అమలులోకి తీసుకురాబోతున్నాం.  


ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ లు 
కానిస్టేబుల్ నుండి ఇన్సిపెక్టర్ స్దాయి వరుకు వీక్లీ ఆఫ్ లు అమలులోకి వస్తుంది.. వీక్లీ ఆఫ్ లతో షిఫ్ట్ డ్యూటిస్  కూడా ఉంటాయి.  20% ఖాళీలను భర్తిలను చేయబోతున్నామని అయన అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 12300 ఖాళీ ఉన్నాయి... కమిటి రిపోర్ట్ లో దీనిపై చర్చించాం.  విశాఖ, కడప, ప్రకాశంలో ట్రైల్స్  చేశాం... అధికారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.  ప్రతి రెండు నెలలకొకసారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. రేపటి నుండి ఏపి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలులోకి వస్తుంది.  వీఐపీ, యాంటి నక్సల్ డ్యూటి కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తి చేస్తాం.. అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటాం.  పోలీసులకి ఒత్తిడి వల్ల స్ట్రోక్స్ , కిడ్ని , షుగర్ వ్యాదులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు.  రిటైర్ అయిన పదిపదిహేళ్లలోనే పోలీసులు చనిపోతున్నారు.  అవసరమైతే వీఆర్ లో ఉన్నవాళ్లని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా తీసుకుంటామని అయన అన్నారు.