సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారాలు కల్పించాలి. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారాలు కల్పించాలి.


జగిత్యాల జూన్ 6, (way2newstv.com)
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు అధికారాలు కల్పించాలని టీ ఉద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది.గురువారం టీ ఉద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యం లో సీపీఎస్ రద్దు అంశం పై  జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో టీ ఉద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,టీ ఎంజీవోల జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మైన్ భోగ శశిధర్, కో చైర్మన్ ఎండీ వకీల్ లు మాట్లాడుతూ తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.


సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారాలు కల్పించాలి.
చండీఘర్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సీపీఎస్ రద్దు,ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ శాఖల ప్రైవేటీకరణ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారన్నారు. ఉద్యోగుల కనీస వేతనం 24 వేలు చెల్లించేలా చర్యలు కేంద్రం చర్యలు తీసుకోవాలని, కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కు సత్వర చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి  ,సంక్షేమానికి త్వరలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు మహారాష్ట్రలో నిర్వహించాలని చండీగర్లో జరిగిన జాతీయ సమావేశంలో నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఆకుల సత్యం, చెలుకల కృష్ణ, జీ ఎస్ ఆర్ విజేంధర్,ఎలిగేటి రవీందర్, నాగేందర్ రెడ్డి,శంషాద్దీన్,హఫీజ్,సత్యనారాయణ, నాజిమ్,తిరుమలరావు,శ్రీనివాస్,ఉమాపతి,రవిచంద్ర, మహమూద్, ముదాం రవి,శ్రీనివాస్,రాజశ్రీ,నాగలత,అర్చన, చంద్రిక.  పెన్షనర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.