ఆర్ఐ మధుసూదన్
తుగ్గలి జూన్ 6, (way2newstv.com)
కౌలు రైతులకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని ఆర్ఐ మధుసూదన్ రైతులకు తెలియజేసారు.కౌలు రైతుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని,అందరితో సమానంగా ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని రెవెన్యూ అధికారులు రైతులకు తెలియజేశారు.
కౌలు రైతులకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు
గురువారం తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి మరియు కడమకుంట్ల గ్రామాలలో రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు రైతులతో మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా కౌలు రైతులు ఉంటే గ్రామ సభ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.దరఖాస్తు చేసిన రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందజేస్తుందని తెలియజేశారు.ఈ గుర్తింపు కార్డు ద్వారా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులను రెవెన్యూ అధికారులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ మధుసూదన్,విఆర్వోలు జయరామిరెడ్డి, రవి,ఎంపీఈఓ సలీం భాష మరియు గ్రామ ప్రజలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.