బేర్ మంటున్న రియల్ వ్యాపారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బేర్ మంటున్న రియల్ వ్యాపారులు


విజయవాడ, జూన్ 20, (way2newstv.com)
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు నుండి మంచి ఊపుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొంత జోరు తగ్గింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఫర్వాలేదు అనిపించినా రియల్ ఏస్టేట్ వ్యాపారం ఫలితాల అనంతరం స్థబ్దుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం మందగమనంలో ఉండటంతో ప్రభుత్వాదాయానికి గండిపడింది. గత ఏడాది డిసెంబర్ వరకు మంచి లావాదేవీలు జరిగినా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తరువాత అవి కాస్త తగ్గాయి. ఇక సీఆర్‌డీఏ పరిధిలో ఎక్కువగా జరిగే రియల్ వ్యాపారం ఇప్పుడు సైలెంట్‌గా ఉంది. కొత్త ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత నూతన ప్రభుత్వ పాలసీ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ ప్రకటన కోసం రియల్టర్‌లు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన నాటి నుండి సీఆర్‌డీఏ పరిధిలో వేల సంఖ్యలో ఇళ్లు, అపార్టమెంట్ల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. మార్కెట్ లెక్కల ప్రకారం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం 10 వేలకు పైగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నట్లు అంచనా. 


బేర్ మంటున్న రియల్ వ్యాపారులు
రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున జరిగిన లావాదేవీలతో ఒక్కసారిగా రియల్ భూమ్ అందుకుంది. మరీ ముఖ్యంగా రాజధాని కోసం రైతులు విరివిగా పొలాలు ఇవ్వడంతో రియల్ వ్యాపారం జోరుగా సాగింది. ఇదే సమయంలో సీఆర్‌డీఏ రైతులు కమర్షియల్‌తో పాటు ఇంటి ప్లాట్లను కేటాయించడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున కొన్ని వర్గాలు ముందుకు వచ్చాయి. ఇందులో ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో రాజధాని బాగా ఉంటుంది, ఈ ప్రాంతంలో తమకంటూ ఒక ఇళ్లు, స్థలం ఉంటే మంచిదని భావించి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. అలాగే లాయర్లు, డాక్టర్లు కూడా రాజధాని ప్రాంతంలో స్థలాలను కొనుగోలు చేశారు. అదే సమయంలో రియల్ భూం మూడు ప్లాట్లు ఆరు కోట్లుగా నడిచింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. ఎన్నికల తరువాత ధరలో వస్తున్న మార్పులు ఇటు కొన్నవారిని, అటు అమ్మినవారిని కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం రాజధాని అంశంలో స్పష్టమైన ప్రకటన ఇస్తేనే తప్పా మళ్లీ రియల్ ఎస్టేట్ పుంజుకునేలా కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో గతంలో ఏకార పొలం 2నుండి 5కోట్ల రూపాయల వరకు క్రయ విక్రయాలు కూడా జరిగాయి. రియల్ భూంను తెరపైకి తీసుకు వచ్చిన కొందరు భూముల ధరలను అమాంతం ఆకాశంలో కూర్చోపెట్టారు. ఇంకా ఇక్కడ స్థలం దొరకదేమో అన్నట్లు చెప్పి పెద్ద ఎత్తున క్రయ విక్రయాలను నిర్వహించారు. దీని కారణంగా 2014 నుండి 2018 చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కనీసం సెంటు స్థలమైన రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేద్దాం. కనీసం పిల్లకు అయినా ఉంటుందని భావించి పెద్ద ఎత్తున ఉన్నత వర్గాలతో పాటు మధ్య తరగతి వర్గాల వారు కూడా భూములను, స్థలాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇందులో అధిక శాతం మంది భవిష్యత్తు అవశరాలను దృష్టిలో పెట్టుకొని కోనుగోలు చేయగా, మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేశారు. పొలాలు, స్థలాల ధరలను రెండు, మూడు, నాలుగింతలు చేసి క్రయ విక్రయాలను నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన లావాదేవీల్లో కనీసం 5శాతం కూడా ఇప్పుడు జరగని పరిస్థితి ఉంది. ఇక అపార్టుమెంట్లు ఇబ్బడి ముబ్బడిగా బిల్డర్లు కట్టడం ప్రస్తుతం వాటికి ధర రాక, సేల్స్ లేకపోవడంతో లబోదిబో మంటున్నారు. గతంలో రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ కోసం రాజధాని వైపు చూసే క్రమం నుండి నేడు రాజధాని మొత్తం ప్రభుత్వ విధి విధానం కోసం ఎదురు చూసే పరిస్థితికి చేరుకుంది.