ఐరన్ లెగ్ గా సునీల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐరన్ లెగ్ గా సునీల్


హైద్రాబాద్, జూన్ 20, (way2newstv.com)
మెడియన్ గా పిచ్చ ఫామ్ లో ఉన్నప్పుడే… హీరోయిజాన్ని చూపించడానికి బయలు దేరి కమెడియన్ వేషాలకు బై బై చెప్పేసిన సునీల్… హీరోయిజం వర్కౌట్ కాక మళ్ళీ కమెడియన్ గా మారాడు. కానీ తను కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అవడంతో సునీల్ కి కమెడియన్ గా కూడా కష్టాలు మొదలయ్యాయి. వెన్నెల కిషోర్ మెల్లగా కమెడియన్ గా టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నారు. వెన్నెల కిషోర్ నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అయినా.. వెన్నెల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. 


ఐరన్ లెగ్ గా సునీల్
ప్రస్తుతం చిన్న చితక సినిమాలు పక్కన పెడితే.. వెన్నెల కిషోర్ ఇండియా వైడ్ గా పాపులర్ కాబోతున్నాడు. ప్రభాస్ సాహో సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక జబర్దస్త్ నుండి రోజుకో కమెడియన్ వెండితెర మీద హల్చల్ చేసున్నాడు. మరి ఒకప్పుడు హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచిన సునీల్ నేడు.. ఐరెన్ లెగ్ మాదిరిగా కనబడుతున్నాడు. హీరోగా మంచి ఫిజిక్ మైంటైన్ చేసి… ఇప్పుడు కమెడియన్ గా మారాక బాగా లావుగా తయారైయ్యాడు. ఇక తను వేసే పంచ్ లు ఏ సినిమాలోనూ పేలడం లేదు. మరి ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా తన ఫ్రెండ్ ని ఏ మాత్రం ఆదుకుంటాడో అనేది ఇప్పుడు డౌట్.  హీరోయిజం పక్కనబెట్టి మల్లి కమెడియన్ గా మారాక తన హవా పెరుగుతుంది అనుకుంటే… ఇప్పుడు తను కమెడియన్ గా కూడా పనికి రాకుండా పోయేలా కనబడుతున్నాడు. మరి చాలామంది ఇక ఇండస్ట్రీలో సునీల్ కి కష్టమే అంటున్నారు.