గోడలెక్కిన ప్రభుత్వ పథకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోడలెక్కిన ప్రభుత్వ పథకాలు


విజయవాడ, జూన్ 19, (way2newstv.com)
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఎపి ముఖ్యమంత్రి స్థిరచిత్తం తో సాగుతున్నారు. ఎన్నికల్లో ఎడా పెడా హామీలు ఇవ్వడమే కాదు వాటిని ఆచరించి చూపాలన్న సంకల్పం ఆయనలో ప్రస్ఫుటం అవుతుంది. పాదయాత్రలో సైతం అన్ని వర్గాలకు జగన్ వరాల జల్లే కురిపించారు. అంతకుముందే నవరత్న హామీలతో జనం మనసు గెలుచుకుని అఖండ విజయాన్ని అందుకున్నారు వైసిపి అధినేత. అందుకే ఇవన్నీ అమలు చేసినప్పుడే తమ ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడుతుందన్న నమ్మకం ఏర్పడుతుందని డిసైడ్ అయిపోయారు ఆయన. 


గోడలెక్కిన ప్రభుత్వ పథకాలు
చెప్పిన మాటలను ఇచ్చిన హామీలు మర్చి పోకుండా ఉండేందుకు ప్రతి నిత్యం వాటిని గుర్తు చేసుకునేందుకు వినూత్న తరహాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాలన యాంత్రాంగం బాధ్యతలను సహచర మంత్రుల కర్తవ్యాన్ని చెప్పక చెప్పేశారు ఎపి సిఎం.ఎపి ముఖ్యమంత్రి జగన్ ఛాంబర్ ఇప్పుడు కొత్తగా దర్శనమిస్తూ అక్కడికి వెళ్లే వారు గోడలపై చూపు తిప్పుకోలేకుండా చేస్తుంది. దానికి కారణం వైసిపి ఇచ్చిన హామీలన్నీ గోడెక్కేశాయి. పెద్ద పెద్ద ఫ్లెక్సీల రూపంలో గోడలపై కొలువై సర్కార్ బాధ్యతను , ప్రాధాన్యతలను చాటి చెబుతున్నాయి. ఈ తరహా ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని జగన్ కొత్త పంథాను అంతా కొనియాడేస్తున్నారు. మరి బాస్ ఏమి చేస్తే మిగతా వారు అదే ఫాలో కావడం ట్రెండ్ కనుక నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రజలకు వైసిపి ఇచ్చిన హామీలను తన ఛాంబర్ లో కూడా పెద్ద ఫ్లెక్సీల రూపంలో తగిలించేసి జగన్ మనసు దోచుకున్నారు. వచ్చే ఐదేళ్లలోపు కాకుండా ఏడాది లోపే ఇచ్చిన హామీలు ఎన్నికల మ్యానిఫెస్టో ను అమలు చేసి చూపాలని దూకుడు గా సాగుతున్న జగన్ తీరు కొత్త ఆలోచనలతో పరిగెడుతుండటం విశేషం. ఎన్నికల మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లతో సమానమని చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా అమలు చేసి చూపాలన్న ఎపి సిఎం ఆలోచన ఫ్లెక్సీల్లోనే ఉంటుందా లేక కార్యాచరణలోకి వస్తుందో రాబోయే కాలమే తేల్చనుంది.