కొలువైయిన కొత్త మంత్రులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొలువైయిన కొత్త మంత్రులు

అమరావతి, జూన్ 8 (way2newstv.com)

ఏపీలో కొత్త మంత్రులు కొలువయ్యారు.  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొట్టమొదట ధర్మాన కృష్ణ ప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత, బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ప్రమాణ స్వీకారం చేశారు.  


కొలువైయిన కొత్త మంత్రులు
కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని)  కుడా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. కొడాలి నాని తర్వాత పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, మాలగుండ్ల శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఈ కార్యక్రమంలో సీఎం జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.