ఊపు మీద బీర్ సేల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఊపు మీద బీర్ సేల్స్


గుంటూరు, జూన్ 19, (way2newstv.com)
ఒక వైపు ఎండలు మండుతుంటే హాట్ హా ట్ సమ్మర్‌లో మాత్రం చల్ల చల్లని బీర్ల సేల్స్ మంచి ఊపుమీదుంది. వేసవి ఎండలతో ఏమోగాని మందుబాబులు మాత్రం ఈ ఏడాది వారు చూపు బీర్లపైనే పడింది. ప్రతీ ఏడాది బీర్ల సేల్స్ వేసవి కాలంలో పెరుగుతూనే ఉంటా యి. కానీ ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉన్నట్లు ఘణాంకాలు చెబుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చి చూస్తే మార్చి, ఏప్రిల్, మేలలో బీర్ సేల్స్ అధికంగా ఉన్నాయి. గత ఏడాదిలో మాత్రం ఉన్న సేల్స్ ఈ ఏడాది ఘననీయమైన వృద్ధిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం విక్రయాలు మండు వేసవిలో కూడా పుంజుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, బార్‌లలో మద్యం సేల్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఈ ఏడాది వేసవిలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వారి విక్రయాలు పెద్దగానే జరిగాయి. దీనికి తోడు ఎన్నికలకు, ఫలితాలు మధ్య చాలా దూరం రావడం, ఎన్నికల ఫలితాలపై చర్చించుకుంటూ బీర్లను, మద్యాన్ని బాగాలే లాగిచ్చారు. 


ఊపు మీద  బీర్ సేల్స్
గత మూడు నెలల ఘణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. జిల్లాలోని మూడు మద్యం సరఫరా కేంద్రాల్లో ద్వారా కొనుగోలు చేసిన మద్యం క్రయవిక్రయాలను పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. జిల్లాలో మొత్తం 352 మద్యం షాపులతో పాటు 185 బార్లలో ఈ మూడు నెలల్లో భారీ అమ్మకాలు జరిగాయి. విజయవాడ పరిధిలోని 1, 2, 3 డిపోల ద్వారా జిల్లాలో ఉన్న మొత్తం మద్యం షాపులకు, బార్లకు మద్యం సరఫరా అవుతుంది. గత ఏడాది కేవలం రెండు డిపోల ద్వారా మాత్రమే మద్యాన్ని సరఫరా చేశావారు. కాని ఈ ఏడాది మాత్రం మరో డిపోతో కలుపుకుని మూడు డిపోలా ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బీరు అమ్మకాలు మొత్తం 5,60,044 కేసులు అమ్మడు పోగా వాటి ద్వారా 93.65 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అలాగే సాదారణ మద్యం అమ్మకాలు మూడు నెలలు కలిపి 9,72, 580 కేసులు అమ్ముడు పోగా వాటి ద్వారా ఎక్సైజ్ ఆదాయం 352.41 కోట్లగా వచ్చింది. అయితే ఈ ఏడాది బీరుతో పాటు సాధారణ మద్యం అమ్మకాలు జోరుగా సాగడంతో ఎక్సైజ్‌శాఖకు మంచి ఆదాయం లభించింది. ఇందులో మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం అమ్మకాలు 8.94,645 కేసులు అమ్మడు పోగా వీటి ద్వారా 432.45 కోట్ల మేర ఆదాయం లభించింది. బీరు అమ్మకాల్లో రికార్డు స్పష్టించి మొత్తం 8,72,800 కేసులు అమ్మడు పోగా వీటి ద్వారా 104.15 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాది మూడు నెలల అమ్మకాల ద్వారా రూ. 446.06 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రాగా, అదే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం రూ. 536.60 కోట్లు ఆదాయం లభించింది. ఎక్సైజ్ ఆదాయంలో గణనీయమైన వృద్ది రావడానికి ముఖ్య కారణం సార్వత్రిక ఎన్నికలుగా చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో నూవ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఈ క్రమంలో మద్యం, డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేశారు. ఎన్నికలకు ముందు నుండే భారీ ఎత్తున మద్యం నిల్వలను ఏర్పాటు చేసుకున్న కొన్ని పార్టీల నేతలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుండి తమ కార్యకర్తలకు ఫలితాలు వచ్చే వరకు పంపిణీ చేస్తునే ఉన్నారు. ఈక్రమంలో ఇంత వృద్ధి వచ్చినట్లుగా ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఎండలు మండిపోతుండటంతో మద్యం ప్రియులు బీర్లపై మొగ్గు చూపారు